దాచేపల్లిలో మరో దారుణం: 13ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కోఆప్షన్ సభ్యుడు
గుంటూరు: దాచేపల్లిలో మైనర్ బాలికపై ఓ వృద్ధుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే అలాంటిదే మరో దారుణం వెలుగుచూసింది. 13ఏళ్ల బాలికపై దాచేపల్లి మండల కోఆప్షన్ సభ్యుడు మహబూబ్ వలీ అత్యాచారానికి పాల్పడ్డాడు.
అంతేగాక, ఈ విషయాన్ని బయటికి చెబితే చంపుతానని ఆ బాలికను బెదిరింపులకు గురిచేశాడు. దీంతో భయపడిపోయిన బాలిక విషయాన్ని ఆలస్యంగా తల్లిదండ్రులకు తెలిపింది. కాగా, బాలిక తల్లదండ్రులు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసుకున్న పోలీసులు బాలికను వైద్య పరీక్షల నిమిత్తం గురజాల ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆమె మూడు నెలల గర్భవతి అని వైద్యులు తెలిపారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు, దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఇటీవల దాచేపల్లిలో తొమ్మిదేళ్ల బాలికపై 60ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో నిందితుడ్ని కఠినంగా శిక్షించాలంటూ భారీ ఎత్తున ఆందోళనలు జరగాయి. సీఎం ఆదేశాలతో పోలీసులు నిందితుడ్ని పట్టుకునేందుకు తీవ్రంగా గాలించారు. కాగా, నిందితుడు చేయకూడని నేరం చేశానంటూ పశ్చాత్తాపంతో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
డబ్బింగ్ సినిమాతో తమిళంలో రజనీకాంత్ రికార్డులను బద్ధలు కొట్టిన రాజశేఖర్ -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications