Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో మరో విపక్ష కూటమి-ఇటు జేడీ- అటు జగన్ ఫేవరెట్ ఐఏఎస్..!

ఏపీలో ఎన్నికల వేళ మరో విపక్ష రాజకీయ కూటమి ఏర్పాటైంది. విజయవాడలో ఎనిమిది రిజిస్టర్డ్ రాజకీయ పార్టీలతో ఈ కూటమి ఏర్పాటైంది. ఇప్పటికే రాష్ట్రంలో అధికార వైసీపీతో పాటు విపక్షంలో టీడీపీ-జనసేన కూటమి ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నాయి. వీరికి బీజేపీ కూడా కలిస్తే మూడు పార్టీల కూటమి ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో వీరిని ఎదుర్కొనేందుకు మాజీ అఖిల భారత సర్వీసు అధికారులు ఈ కూటమిని ఏర్పాటు చేసుకున్నారు.

ఏపీ యునైటెడ్ ఫ్రంట్ పేరుతో ఏర్పాటైన ఈ విపక్ష కూటమిలో జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు, సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ, తాజాగా ప్రారంభించిన మరో రాజకీయ పార్టీ లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ ఐఏఎస్ జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ తో పాటు మరో ఆరుగురు నేతలు ఉన్నారు. ఇప్పటికే వీవీ లక్ష్మీనారాయణ, జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తూ తమ రాజకీయ పార్టీల ప్రచారం చేసుకుంటున్నారు.

another opposition front formed in ap with former cbi jd vv lakshminarayana, ex ias vijaykumar

అయితే ఈసారి ఎన్నికల్లో హోరాహోరీ పోరు తప్పదన్న అంచనాల నేపథ్యంలో వీవీ లక్ష్మీనారాయణ, విజయ్ కుమార్ తో పాటు ఆల్ తెలుగు ప్రజా పార్టీ కోఆర్డినేటర్ డాక్టర్ రఘు, ఐఆర్ఎస్ శివభాగ్యరావు, జాతీయ సమసమాజ్ పార్టీ తరఫున రామయ్య యాదవ్, ప్రజా రిపబ్లికన్ పార్టీ తరఫున దాసరి చెన్నకేశవులు, స్వతంత్ర జనతా పార్టీ తరఫున ఆనంద్ కుమార్, జై భారత్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట రామారావు, నవతరం పార్టీ రాజు సుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. వీరంతా రాబోయే ఎన్నికల్లో అధికార, విపక్షాలకు పోటీగా సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

another opposition front formed in ap with former cbi jd vv lakshminarayana, ex ias vijaykumar

మరోవైపు ఈ కూటమిలో ఉన్న లిబరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ గతంలో జగన్ సర్కార్ లో వివిధ కీలక పదవుల్లో పనిచేశారు. ముఖ్యంగా మున్సిపల్ శాఖలో ఉంటూ మూడు రాజధానుల కోసం రిపోర్టులు తయారు చేసిన కమిటీల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టి, యునైటెడ్ ఫ్రంట్ కూటమిలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+