జనసేనకు మరో సీనియర్ నేత గుడ్ బై.... పవన్ కు వరుస షాకులు
Recommended Video
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు ఆ పార్టీ నేతలు వరుస షాకులు ఇస్తున్నారు. ఒకపక్క జనసేన పార్టీని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తుంటే మరొకపక్క పార్టీ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ నుండి జంప్ అవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు , సినిమాలు కూడా చెయ్యాలని నిర్ణయం తీసుకున్న నేపధ్యంలో జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్న సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ పార్టీని వీడి వెళ్ళిపోయారు . ఇక తాజాగా పార్టీలో కీలకంగా ఉన్న మరో నేత పార్టీ కి గుడ్ బై చెప్పి పవన్ కు షాక్ ఇచ్చారు .

మాజీ జేడీ ఇచ్చిన షాక్ మరువక ముందే పవన్ కు మరో షాక్
పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో నటిస్తుండటం వల్లే తాను పార్టీ నుంచి బయటికి వచ్చినట్లు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఇక తాజాగా అదే బాటలో మరో సీనియర్ నేత జనసేనకు రాజీనామా చేశారు. గాజువాక నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం కనకారావు పార్టీని వీడారు. గత ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ గాజువాక నుండి పోటీ చెయ్యగా పార్టీ కోసం కనకారావు కీలకంగా పని చేశారు . ఇక తాజాగా జనసేన పార్టీని వీడి కారణం కనకారావుతో పాటు 200 మంది జనసేన కార్యకర్తలు వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలోకి చేరారు.

పార్టీ వీడిన కరణం కనకారావు వైసీపీ లో చేరిక
ఇక అంతే కాదు గాజువాక నియోజక వర్గంలో కీలకంగా వ్యవహరించిన నేత గాజువాక మాజీ ఎమ్మెల్యే, జనసేన పార్టీ సీనియర్ నేత చింతలపూడి వెంకట్రామయ్య కూడా ఐదు నెలల క్రితమే జనసేన పార్టీని వీడారు. గత ఎన్నికల్లో ఆయన పెందుర్తి నుండి పోటీ చేసి ఓడిపోయారు. గాజువాకలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేశారు. నియోజకవర్గవలో లక్షకుపైగా సభ్యత్వాలు రావడంలో కీలకపాత్ర పోషించారు. కానీ ఆయన సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు కరణం కనకారావు పార్టీని వీడి వెళ్ళిపోయారు .వైసీపీ లో చేరారు .

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పవన్ కు గట్టి దెబ్బ
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న నేపధ్యంలో కరణం కనకారావు పవన్ కు షాక్ ఇచ్చారనే చెప్పాలి . ఇటీవల సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ఇచ్చిన షాక్ నుండి కోలుకోక ముందే జనసేన పార్టీకి మరో షాక్ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పవన్ కు తగులుతున్న ఈ షాకులు , కీలక నేతలు పార్టీని వీడి బయటకు వెళ్ళటం జనసేనపార్టీకి తీరని నష్టం అని చెప్పొచ్చు .












Click it and Unblock the Notifications