వైజాగ్ లో వైసీపీకి మరో షాక్ ! జగన్ సన్నిహిత నేత గుడ్ బై.. !
ఏపీలో ఎన్నికల వేళ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా వైసీపీ సర్కార్ ప్రతిపాదిత మూడు రాజధానుల్లో కీలకమైన వైజాగ్ లోనే ఆ పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా నగరానికి చెందిన వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఆ పార్టీని వీడి జనసేనలో చేరిపోయారు. ఇప్పుడు జగన్ ను సన్నిహితుడైన మరో నేత తనకు అసెంబ్లీ టికెట్ రాదని తేలిపోవడంతో వైసీపీని వీడిపోయారు.
వైసీపీలో సీనియర్ నేతగా ఉన్న వైజాగ్ నాయకుడు సీతంరాజు సుధాకర్ కు సీఎం జగన్ కు సన్నిహితుడనే పేరుంది. ఇదే క్రమంలో గతంలో టికెట్ దక్కించుకోవడంలో విఫలమైన ఆయన.. బ్రాహ్మణకార్పోరేషన్ ఛైర్మన్ గానూ, వీఎంఆర్డీఏ ఛైర్మన్ గానూ నామినేటెడ్ పదవులు దక్కించుకున్నారు. అయితే వైజాగ్ దక్షిణ నియోజకవర్గం నుంచి ఈసారి పోటీ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు చివరి నిమిషం వరకూ తనకు టికెట్ దక్కుతుందనే ఆశతో ఉన్నారు. అది కాస్తా ఫెయిల్ కావడంతో సీతంరాజు ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పేశారు.

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు పేర్కొంటూ సీఎం జగన్ కు ఇవాళ ఆయనో లేఖ రాశారు. ఇందులో సీతంరాజు సుధాకర్ విశాఖ దక్షిణంలో తనకు టికెట్ దక్కకపోవడం వెనుక కారణాలను, వైసీపీలో వర్గ విభేదాలను వివరించినట్లు సమాచారం. ఈ పరిణామాలతో విసిగిపోయి తాను వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు సీతంరాజు సుధాకర్ ప్రకటించారు.
వైజాగ్ దక్షిణ నియోజకవర్గం నుంచి గతంలో టీడీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇన్ ఛార్జ్ గా ఉన్నారు. అయినా కొత్త వారిని బరిలోకి దింపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సీతంరాజు రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications