చంద్రబాబు కోసం మరో స్టార్ క్యాంపెయినర్.. ఏపీలో నటి రేవతి ఎన్నికల ప్రచారం

ఏపీలో రాజకీయం రసకందాయంలో పడింది. హోరాహోరీగా ప్రచార పర్వం సాగుతుంది. ఒకరిని మించి ఒకరు మాటల తూటాలు పేలుస్తున్నారు. ప్రజల మద్దతు కోసం నేతలు ఎండను సైతం లెక్క చెయ్యక ప్రచార పర్వం నిర్వహిస్తున్నారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేసేందుకు జాతీయ నేతలు వచ్చిన విషయం అందరికీ తెలుసు . ఇక టీడీపీ స్టార్ క్యాంపెయినర్లు గా నారా రోహిత్ , నందమూరి తారక రత్న లు రంగంలోకి దిగాడు. ఇంకో పక్క నటి దివ్య వాణి దూకుడు చూపిస్తోంది. ఇక ఈ క్రమంలో టీడీపీ తరపున మరో స్టార్ క్యాంపెయినర్ రంగంలోకి దిగనుంది.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు (ఫొటోలు)

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా రేవతి

టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా రేవతి

ఏపీలో టీడీపీ తరపున ప్రముఖ సినీ నటి రేవతి స్టార్ క్యాంపెయినర్ గా ప్రచారం నిర్వహించనున్నారు. నేడు , రేపు (ఏప్రిల్ 4,5 తేదీల్లో) రేవతి ఏపీలో ప్రచారం చేయనున్నారు. ఈ విషయాన్ని ఏపీ రాష్ట్ర హస్తకళల ఛైర్మన్ పాలి ప్రసాద్ ప్రకటించారు .

వైసీపీ లో చేరిన చాలామంది సినీ ప్రముఖులు ... టీడీపీ కోసం రానున్న రేవతి

వైసీపీ లో చేరిన చాలామంది సినీ ప్రముఖులు ... టీడీపీ కోసం రానున్న రేవతి

తాజాగా జరగనున్న ఎన్నికల నేపధ్యంలో ఏపీలో తెలుగు సినిమా ప్రముఖులు చాలా మంది వైసీపీలో జాయిన్ అయ్యారు ..మరికొందరు సపోర్ట్ గా నిలిచారు. ఇక ఈ క్రమంలో రేవతి తమిళనాడు నుంచి వచ్చి సీఎం చంద్రబాబు తరపున ప్రచారం చేయటం విశేషం .తెలంగాణ సీఎం కేసీఆర్ కు భయపడి వారి ఆస్తులను రక్షించుకునేందుకు తెలుగు సినిమా ప్రముఖులంతా జగన్ పార్టీలో చేరుతున్నారని సీఎం చంద్రబాబు విమర్శిస్తున్నారు. ఇదంతా అటుంచితే మొత్తానికి తమిళ నాట సక్సెస్ అయిన నటి రేవతి ప్రచార షెడ్యూల్ ఖరారు చేసింది టీడీపీ .

ఏపీలో రేవతి ప్రచార షెడ్యూల్

ఏపీలో రేవతి ప్రచార షెడ్యూల్

ఏపీలో రేవతి రెండు రోజుల పాటు ప్రచారం నిర్వహించనున్నారు. నేడు, రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు రేవతి . 4వ తేదీ ఉదయం 9 గంటలకు ఏలూరు నియోజకవర్గంలోని 49వ డివిజన్ లో ప్రచారం నిర్వహిస్తారు .సాయంత్రం 4 గంటలకు తాడేపల్లిగూడెం లో ప్రచారం చేస్తారు . రాత్రికి పాలకొల్లులో బస చేస్తారు రేవతి . 5వ తేదీ ఉదయం 9 గంటలకు పాలకొల్లు లో ప్రచారం నిర్వహిస్తారు . ఇక సాయంత్రం 4 గంటలకు నరసాపురం లో ప్రచారమో పాల్గొంటారు. రేవతి తో పాటు ప్రచారంలో పలువురు టీడీపీ నేతలు కూడా పాల్గొననున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+