ఏపీలో నిరుద్యోగులకు మరో సూపర్ ఛాన్స్ ... జనవరిలో 44,941 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో అధికారంలో ఉన్న వైసిపి సర్కార్ నిరుద్యోగ యువతకు మరోమారు శుభావార్త చెప్పింది. ఇప్పటికే పలుమార్లు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలను కల్పించిన వైసీపీ సర్కార్ మరో నోటిఫికేషన్ కు రంగం సిద్ధం చేసుకుంది. ఏపీలో నిరుద్యోగులు ఎక్కువగా ఉన్న నేపధ్యంలో వారందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించటానికి కంకణం కట్టుకున్న వైసీపీ ప్రభుత్వం మరో మారు నిరుద్యోగులకు బంపర్ ఛాన్స్ ఇవ్వనుంది. జగన్ సీఎంగా వచ్చిన నాటి నుండి నిరుద్యోగం తగ్గించటానికి తీసుకుంటున్న చర్యలు, విడుదల చేస్తున్న నోటిఫికేషన్లతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

జనవరి నెలలో మరో భారీ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వనుంది. నిరుద్యోగ యువతకు ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండీ ఇప్పటికే పలు ఉద్యోగాల భర్తీ చేపట్టిన ప్రభుత్వం ఇక తాజాగా మరోమారు ఉద్యోగాల భర్తీకి కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ సర్కార్ జనవరిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనుంది. 44,941 పోస్టుల భర్తీకి ఈ దఫా శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తుంది.నిరుద్యోగుల కోసం మరో నియామక ప్రక్రియను చేపట్టిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో బిజీగా ఉంది.

Another Super Chance for Unemployed in AP ... Notification for 44,941 Posts in January

ఇక ఈసారి నోటిఫికేషన్ ఇవ్వనున్న పోస్టులు శాఖల వారీగా చూస్తే పోలీస్ డిపార్ట్ మెంట్ లో 13,591 పోస్టులు, డి.ఎస్సి లో 20,000 పోస్టులు, గ్రూప్-2 లో 1000 పోస్టులు, గ్రూప్-4 లో 2,600 పోస్టులు, అటవీ శాఖలో 2,750 పోస్టులు ఇతరులు 5000 పోస్టుల భర్తీకి ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.జనవరిలో నోటిఫికేషన్ విడుదల కాకానున్న నేపధ్యంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు నిరుద్యోగుల పాలిట వరంగా మారిందని చెప్పొచ్చు . ఇప్పటివరకు జాబ్ రాలేదని బాధపడేవారికి ఇది సువర్ణావకాశం అని చెప్పొచ్చు. ఇంకెందుకు ఆలస్యం ఏపీలో ఉన్న నిరుద్యోగ యువత ఈ వార్త తెలీగానే పుస్తకాలతో కుస్తీ పట్టి ఎలాగైనా ఉద్యోగం సాధించండి మరి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+