కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు

ప్రయాణికుల అదనపు రద్దీని నివారించడానికి రైల్వే అధికారులు పలు మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నడిపించనున్నారు. మొన్నటి హోలీ పండగ నేపథ్యంలో చర్లపల్లి, తిరుపతి నుంచి ఈ ప్రత్యేక సర్వీసులు వివిధ ప్రధాన గమ్యస్థానాల మధ్య అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వీటిల్లో మెజారిటీ రైళ్లు రెగ్యులర్ సర్వీసులుగా మారడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రయాణికుల నుండి అపూర్వ ఆదరణ అందుతున్న నేపథ్యంలో వీటిని రైల్వే అధికారులు ప్రత్యేక రైళ్ల నుండి రెగ్యులర్ ట్రైన్లుగా మార్ప చేశారు.

తాజాగా రైల్వే బోర్డు మరో ప్రత్యేక రైలును రెగ్యులర్ సర్వీస్ గా మార్చడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను ఆమోదించింది. 09520 / 09519 ఓఖా-తిరుపతి స్పెషల్ రైలు అది. దీన్ని 19559 / 19560 ఓఖా-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌గా మార్చింది. ఇది గుజరాత్, ఏపీ మధ్య వారానికోసారి రెగ్యులర్ సర్వీస్‌గా నడుస్తుంది. దీని వల్ల గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

Another Tirupati Express Train Becomes Weekly Regular Service Connecting Gujarat and Andhra Pradesh

ప్రతి సోమవారం రాత్రి 11:35 గంటలకు ఓఖా నుండి బయలుదేరే నంబర్ 19560 నంబర్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండో రోజు బుధవారం రాత్రి 11:30 గంటలకు తిరుపతికి చేరుతుంది. అదేవిధంగా ప్రతి గురువారం ఉదయం 8:15 నిమిషాలకు తిరుపతి నుండి బయలుదేరే నంబర్ 19559 ఎక్స్‌ప్రెస్ రెండో రోజు శనివారం ఉదయం 11:50 నిమిషాలకు ఓఖాకు చేరుతుంది.

ద్వారక, ఖంభాలియా, జామ్‌నగర్, హాపా, రాజ్‌కోట్, వంకనేర్, సురేంద్రనగర్, విరంగాం, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, ఉధ్నా, నందుర్‌బార్, అమల్‌నేర్, జల్ గావ్, భుసావల్, మల్కాపూర్, అకోలా, వాసిం, హింగోలి దక్కన్, బాస్మత్, పూర్ణ, నాందేడ్, బాసర, నిజామాబాద్, కామారెడ్డి, బొల్లారం, కాచిగూడ, మహబూబ్‌నగర్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, తాడిపత్రి, కడప, రాజంపేట, రేణిగుంట మీదుగా రాకపోకలు సాగిస్తుంది.

రైలు ప్రధాన నిర్వహణ ఓఖాలో జరుగుతుంది, తిరుపతిలో చిన్నపాటి నిర్వహణ ఉంటుంది. రాజ్‌కోట్, అహ్మదాబాద్, నందుర్‌బార్, భుసావల్, పూర్ణ, కాచిగూడ స్టేషన్లలో నీటిని నింపుతారు. రాజ్‌కోట్, అహ్మదాబాద్, భుసావల్, పూర్ణ స్టేషన్లల్లో సిబ్బంది మార్పిడి ఉంటుంది. ఈ రైలు కూర్పులో జనరల్ సీటింగ్- 4, జనరల్ సెకెండ్ క్లాస్ అండ్ లగేజీ కమ్ బ్రేక్ వ్యాన్- 2, 3టయర్ ఏసీ- 3, 2 టయర్ ఏసీ- 2, స్లీపర్ క్లాస్- 10 కోచ్‌లు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+