శివరాత్రి వేళ మరో విషాదం... ఇద్దరు గల్లంతు.. ఎక్కడంటే ?
ఏపీలో మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఏలూరు జిల్లా ముసునూరు మండలం బలివే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాల్లో ఈ విషాదం జరిగింది. తమ్మిలేరు వాగులో స్నానాలకు దిగి ఇద్దరు యువకులు గల్లంతు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనలో ఒక యువకుడు మృతి చెందగా.. మరో యువకుడు గల్లంతయ్యాడు. ప్రస్తుతం ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మహా శివరాత్రిని పురస్కరించుకొని యువకులు వాగులో స్నానం చేయడానికి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే లోతు ఎక్కువగా ఉండడంతో యువకులు గల్లంతు అయినట్టు వాపోతున్నారు. వారిలో ఒకరు మృతి చెందగా.. మరో యువకుడి కోసం గాలిస్తున్నట్టు సమాచారం అందుతోంది.

ఇక మరోవైపు ఇప్పటికే ఈరోజు ఉదయం తూర్పు గోదావరి జిల్లా తాడిపూడి వద్ద గోదావరిలో స్నానానికి దిగి ఐదుగురు యువకులు మృతి చెందారు. నదిలో స్నానానికి వెళ్లిన యువకులు.. లోతు ఉన్న ప్రదేశాన్ని గుర్తించకపోవడంతో మునిగిపోయారు. అధికారులు గాలింపు చేపట్టగా ఐదుగురు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మొదట.. తిరుమల శెట్టి పవన్, పడాల దుర్గాప్రసాద్, పడాల సాయి లభ్యం అయ్యాయి. ఆ తర్వాత గర్రె ఆకాష్, అనిసెట్టి పవన్ మృతదేహాలు దొరికాయి. యువకులు అంతా 25 ఏళ్ల లోపు వారే కావడంతో.. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications