VV Lakshminarayana : వైజాగ్ ఎంపీగా మాజీ జేడీ లక్ష్మీనారాయణ పోటీపై మరో ట్విస్ట్..!

ఏపీలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటు నుంచి పోటీ చేసే విషయంలో సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సస్పెన్స్ కొనసాగుతోంది. దీనిపై ఆయన ఎటూ తేల్చుకోలేకపోతున్నారు.

వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటులో పోటీ ఉత్కంఠ రేపుతోంది. హాట్ సీటుగా భావిస్తున్న ఈ ఎంపీ నియోజకవర్గంలో పోటీకి ఇప్పటి నుంచే పలువురు నేతలు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ మరోసారి పోటీకి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేయాలనే దానిపై ఆయనకు స్పష్టత కరవైంది. దీంతో ఆయన ఇదే అంశంపై రోజుకో వ్యాఖ్య చేస్తూ తన గందరగోళాన్ని బయటపెట్టుకుంటున్నారు.

విశాఖ ఎంపీ సీటులో మరోసారి పోటీపై ఇవాళ మరోసారి సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన అభిప్రాయాలకు దగ్గరగా ఉండే పార్టీ నుంచి పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలా కుదరకపోతే మాత్రం స్వతంత్ర అభ్యర్ధిగా బరిలోకి దిగుతానంటూ వీవీ లక్ష్మీనారాయణ సంకేతాలు ఇచ్చారు. అంటే ఇఫ్పటివరకూ తన పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన చెప్పకనే చెప్పారు. గత ఎన్నికల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన ఈ సీబీఐ మాజీ జేడీ.. మరోసారి అదే పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు ప్రయత్నిస్తున్నా జనసేనతో టీడీపీ పొత్తు వార్తలు అడ్డంకిగా మారాయి.

another twist in former cbi jd vv lakshminarayana contest from vizag mp seat

గతంలోనే జనసేన పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయాక ఆ పార్టీకి దూరంగా ఉంటున్న సీబీఐ మాజీ జేడీకి విశాఖలో పరిస్దితులు అంత అనుకూలంగా కనిపించడం లేదు. దీనికి ప్రధాన కారణం జనసేనతో టీడీపీ పొత్తు వార్తలతో పాటు టీడీపీ అభ్యర్ధిగా మరోసారి బాలకృష్ణ అల్లుడు శ్రీ భరత్ పోటీ చేసేందుకు సిద్దమవుతుండటమే. దీంతో శ్రీభరత్ ను కాదని లక్ష్మీనారాయణకు మద్దతిచ్చేందుకు టీడీపీ కానీ, జనసేన కానీ సిద్ధంగా లేవు. ఈ నేపథ్యంలో ఈ మధ్య వైఎస్ జగన్ పైనా ప్రశంసలు కురిపిస్తున్న లక్ష్మీనారాయణ.. వైసీపీ తరఫున టికెట్ లభిస్తుందేమో అన్న ఆశల్లో కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ వైసీపీ మాత్రం గతంలో జగన్ పై సీబీఐ కేసుల నమోదులో కీలక పాత్ర పోషించిన ఆయనపై ఆసక్తి చూపడం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+