వివేకా కేసులో సీబీఐకి ఝలక్ ! ఛార్జిషీట్ వెనక్కి పంపిన సీబీఐ కోర్టు ? ఆ తర్వాత ..
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ కేసులో నిందితుల అరెస్టులు, బెయిల్, విచారణలో సీబీఐ నిర్ణయాలు సంచలనం రేపుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీంతో ఈ వ్యవహారంలో మరో ట్విస్ట్ ఎదురైనట్లయింది. ఈ విషయాన్ని ఇవాళ తెలంగాణ హైకోర్టుకు సీబీఐ అధికారులు వెల్లడించారు.

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30వ తేదీలోపు పూర్తి చేసి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు గతంలో సీబీఐకి డెడ్ లైన్ పెట్టింది. ఈ మేరకు జూన్ 30 వరకూ దర్యాప్తును దాదాపుగా పూర్తి చేసిన సీబీఐ.. హైదరాబాద్ సీబీఐ కోర్టులో జూ0న్ 30న అదనపు ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఇందులో పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. అయితే ఈ ఛార్జిషీట్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీని వెనుక సాంకేతిక కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. తప్పుల్ని సరిచేసి తిరిగి ఛార్జిషీట్ దాఖలు చేయాలని సీబీఐకి కోర్టు సూచించింది.
దీంతో సీబీఐ అధికారులు వివేకా కేసులో తాజా ఛార్జిషీట్ లో దొర్లిన సాంకేతిక తప్పిదాల్ని సవరించి హైదరాబాద్ సీబీఐ కోర్టులో తిరిగి దాఖలు చేశారు. ఈ విషయాన్ని హైకోర్టులో దస్తగిరి పిటిషన్ విచారణ సందర్భంగా సీబీఐ అధికారులు వెల్లడించారు. దీంతో ఛార్జిషీట్ తిరస్కరణ అంశం బయటపడింది. అయితే గతంలోనూ పలు ఛార్జిషీట్లు సాంకేతిక కారణాలతో తిరస్కరణకు గురైన సందర్భాలు ఉండటంతో ఈ వ్యవహారంపై హైకోర్టుకు తాజా అంశాన్ని సీబీఐ అప్ డేట్ చేసినట్లయింది.
వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేసేందుకు సుప్రీంకోర్టు జూన్ 30 డెడ్ లైన్ పెట్టిన నేపథ్యంలో ఈ దర్యాప్తు పూర్తయిందా లేదా అన్న అంశంపై సస్పెన్స్ కొనసాగుతోంది. డెడ్ లైన్ ముగిసే రోజు సీబీఐ ఛార్జిషీట్ అయితే దాఖలు చేసింది. కానీ అది తుది ఛార్జిషీటా కాదా అన్న అంశంపై క్లారిటీ లేదు. అలాగే సుప్రీంకోర్టును సీబీఐ మరోసారి దర్యాప్తు గడువు పెంచమని కూడా కోరకపోవడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. సీబీఐ దీనిపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!!












Click it and Unblock the Notifications