రోజా మరో ఏడాది సస్పెండ్?: ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు, ఆంటీ వ్యాఖ్యలపై బొండా ఇలా

Subscribe to Oneindia Telugu

అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజాపై మరో ఏడాదిపాటు సస్పెన్షన్ విధించాలంటూ ప్రివిలేజ్ కమిటీ తన సిఫార్సులను అసెంబ్లీ ముందు పెట్టింది. బేషరతుగా క్షమాపణలు చెబుతానని రోజా ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేసింది కమిటీ. 

రోజా వివిధ సందర్భాల్లో భిన్న వాదనలు వినిపించారని కమిటీ తెలిపింది. విచారణకు సంబంధించిన అన్ని వివరాలను నివేదికలో పేర్కొన్న కమిటీ, 62పేజీలతో సభకు నివేదిక సమర్పించింది.

కాగా, రోజా సస్పెన్షన్‌పై నిర్ణయం తీసుకునే అధికారాన్ని మాత్రం శాసనసభకే వదిలేసింది ప్రివిలేజ్ కమిటీ. ఈ క్రమంలో ఇప్పటికే ఏడాది సస్పెన్షన్‌కు గురైన రోజా.. మరో ఏడాదిపాటు అసెంబ్లీకి దూరమవుతుందా? అనే అనుమానాలు నెలకొన్నాయి. 

'ఆంటీ' వ్యాఖ్యలపై బొండా వివరణ

roja-bonda uma

గురువారం అసెంబ్లీకి వెళుతూ పలువురు ఎమ్మెల్యేలు ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజల సమస్యలపై చర్చించాల్సిన సభాసమయాన్ని వృథా చేసుకోవడం మంచిదికాదని చెబుతూ రోజా విషయానికి ఇంతటితో ఫుల్‌స్టాప్ పెట్టాలని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తోటి ఎమ్మెల్యేలకు పరోక్షంగా సూచించారు.

విష్ణుకుమార్ వ్యాఖ్యలపై స్పందించిన బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. 'సభలో 175 మంది సభ్యులు ఉన్నారు. ఏ ఒక్కరికి కూడా ప్రత్యేక రూల్స్ అంటూ ఉండవు. అలాగే రోజా కూడా ఒక సభ్యురాలు. రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా? లేవు. మంత్రి సుజాత, ఎమ్మెల్యే అనితల పట్ల రోజా ఎలా ప్రవర్తించిందో సమాజం మొత్తం చూసింది' అని చెప్పారు.

'బోండా ఉమా తనను ఆంటీ అన్నాడని, అచ్చెన్నాయుడు అసభ్యంగా దూషించాడని, దానిపై కూడా విచారణ జరపాలి కదా అని రోజా అన్న వ్యాఖ్యలపై ఏం సమాధానం చెబుతారు' మీడియా ప్రతినిధి ప్రశ్నించగా.. ఆంటీ అనడానికి, బూతులు తిట్టడానికి చాలా తేడా ఉందని బొండా ఉమ అన్నారు.

'ఆంటీ అనేది రోజాకు సరిపోయే గౌరవప్రదమైన పదం. అంతేకానీ, మేం బూతులు మాట్లాడలేదు. కాబట్టి ఆంటీ అనడానికి దానికి సంబంధం లేదు(నవ్వుతూ). నేను ఆంటీ అంటే నన్ను ఏమన్నా అనమనడండి. కానీ మధ్యలో అనిత ఏం చేసింది?. సభలో ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడం కామన్. కానీ అవి అసభ్యంగా ఉండకూడదు. ఒకవేళ అలాంటి పదాలు మాట్లాడితే అవతలివాళ్లకు మనం క్షమాపణ చెప్పాలి' అని బోండా సూచించారు.

'ఎమోషన్‌లో మాట జారినప్పుడు అనంతరం దాన్ని ఉపసంహరించుకోవాలి. అంతేగానీ రోజాకు ఏమైనా ప్రత్యేక చట్టాలు ఉన్నాయా?. ప్రివిలేజ్ కమిటీ ఎవరో చెప్పిన మాటలను బట్టి యాక్షన్ తీసుకోదు. పూర్తి ఆధారాలుండాలి. దళిత మంత్రికి చెప్పు చూపించడం.. ముఖ్యమంత్రిని నానా దుర్భాషలాడడం.. దళిత ఎమ్మెల్యేను నోటికొచ్చినట్టు మాట్లాడడం.. ఇవన్నీ రోజా చేసిన తప్పులు. ఎవరికీ ప్రత్యేక చట్టాలు లేవు కాబట్టి తప్పు చేసినప్పుడు ఎవరైనా క్షమాపణ చెప్పాలి' అని టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా తేల్చి చెప్పారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It is said that may likely to another year suspension on YSR Congress Party RK Roja.
Please Wait while comments are loading...