వైసీపీకి ఇవాళ మరో ఎమ్మెల్యే గుడ్ బై ? కాసేపట్లో కీలక ప్రకటన..!
వైసీపీలో ఇన్ ఛార్జ్ ల మార్పుతో పాటు అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న మరో ఎమ్మెల్యే ఇవాళ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే అనుచరులతో పలుమార్లు భేటీ అయిన సదరు ఎమ్మెల్యే తుది ప్రకటన చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అలాగే తాను ఏ పార్టీలోకి వెళ్లబోయేదీ ఆయన ఇవాళ క్లారిటీ ఇచ్చేయబోతున్నారు. దీంతో ఆ వైసీపీ తొలిసారి ఎమ్మెల్యే ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది.
ఏపీలో వైసీపీ తరఫున 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేల్లో మైలవరం నేత వసంత కృష్ణప్రసాద్ ఒకరు. అదీ వైసీపీలో గెలిచిన అతి కొద్ది మంది కమ్మ సామాజిక వర్గ ఎమ్మెల్యేల్లో కూడా ఒకరు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో సీనియర్ రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వైఎస్ జగన్ వ్యాపార భాగస్వామి, కేసుల్లో కూడా భాగస్వామి అయిన వసంత కూడా ఒకరు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న వసంత కృష్ణప్రసాద్ వైసీపీకి ఇవాళ గుడ్ బై చెప్పేయబోతున్నారు.

Recommended Video

మైలవరంలో ఓవైపు తనకు లైన్ క్లియర్ అంటూనే మంత్రి జోగి రమేష్ కు ఈ నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యానికి అనుమతించడం, స్ధానికంగా జిల్లాలో కమ్మ సామాజిక వర్గం నుంచి పెరుగుతున్న ఒత్తిడి, అధిష్టానం తన మాటకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటి కారణాలతో వసంత కృష్ణప్రసాద్ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పలుమార్లు జగన్ తో కలిసి చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో చివరిగా వైసీపీకి గుడ్ బై చెప్పేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇవాళ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు.
ఇప్పటికే వసంత కృష్ణప్రసాద్ కు టీడీపీలో ఎమ్మెల్యే సీటు ఆఫర్ ఉంది. దీంతో ఆయన ఇవాళ వైసీపీకి గుడ్ బై చెప్పడానికి గల కారణాలను వివరించి టీడీపీలో చేరికపై కీలక ప్రకటన చేయబోతున్నారు. అనంతరం ఆయన టీడీపీలో లాంఛనంగా చేరడం, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం చకచకా జరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. వసంత టీడీపీలోకి వస్తే గతంలో మైలవరంలో గెలిచిన దేవినేని ఉమకు మరో నియోజకవర్గం కేటాయించేందుకు అధిష్టానం సిద్ధమవుతోంది.












Click it and Unblock the Notifications