Cyclone Arnab: అంతర్వేదీ తీరంలో సల్ఫర్ నౌక కలకలం.. తుపాను ప్రభావంతో ఒడ్డుకు
ఏపీలో అర్నబ్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. అయితే ఈ తుపానులో విశాఖపట్నం నుంచి సింగపూర్ కు బయలుదేరిన ఒక భారీ కార్గో నౌక అనుకోని ఇంజిన్ వైఫల్యం కారణంగా తన గమ్య మార్గాన్ని కోల్పోయింది. తీవ్రమైన తుపాను పరిస్థితుల నేపథ్యంలో ఈ సల్ఫర్ సరుకు రవాణా నౌక తూర్పు గోదావరి జిల్లా అంతర్వేది సమీపాన సముద్రంలో కొట్టుకువచ్చి తీరానికి చేరినట్లు సమాచారం. ఇంజిన్ వైఫల్యం కారణంగా ముందుకు కదల్లేకపోయిన ఈ భారీ కార్గో నౌక ఆ తర్వాత నియంత్రణ కోల్పోయి సముద్రంలో కొట్టుకువచ్చి తీరానికి చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మెర్కంటైల్ మెరైన్ డిపార్ట్‌మెంట్ (MMD) సర్వేయర్ ధర్మాసస్త వెల్లడించారు. పోర్టు, సముద్ర భద్రతా అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. నౌకలో తనిఖీ తర్వాత ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నట్లు పేర్కొన్నారు. ఇక పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కదిలిన ఈ తీవ్ర తుపాను తీరం దాటే సమయంలో గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల వేగంతో అలాగే గరిష్టంగా 150 కిలోమీటర్ల వేగంతో భీకర ఈదురుగాలులు వీచినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక తుపాను క్రమంగా బలహీనపడి తీవ్ర స్థాయి నుంచి సాధారణ తుపానుగా మారింది.
@ANDHAPRADESH @VIZAG A cargo ship carrying sulphur from @Visakhapatnam ran aground near Antarvedi in AP due to engine failure during #CycloneArnab Maritime authorities are closely monitoring the grounded vessel and inspecting its condition for further action.@IANSENGMONTHLY https://t.co/h4C9moDofZ
— Gummalla Lakshmana (@GUMMALLALAKSHM3) October 28, 2026
అక్టోబర్ 28 రాత్రికి తుపాను మరింత బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే తుపాను తగ్గుముఖం పట్టినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఈ మేరకు అక్టోబర్ 29 ,30 తేదీల్లో ఉత్తరాంధ్రలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని అంచనా వేసింది. ముఖ్యంగా శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచనలు చేస్తున్నారు. ఈ మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు.












Click it and Unblock the Notifications
