నాడు ఎన్టీఆర్‌ను కదిలించిన దూబగుంట రోశమ్మ కన్నుమూత
కనిగిరి: సారా వ్యతిరేక ఉద్యమ నాయకురాలు, స్వర్గీయ నందమూరి తారక రామారావును కదిలించిన దూబగుంట రోశమ్మ మృతి చెందారు. 1991లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండల పరిధిలోని తూర్పు దూబగుంట గ్రామం నుంచి మద్య నిషేధాన్ని డిమాండ్ చేస్తూ ఆమె ఉద్యమాన్ని ప్రారంభించారు.

నాటి ఉద్యమం ఉవ్వెత్తున లేచింది. నాడు ప్రతిపక్షంలో ఎన్టీఆర్.. ఆమె ఉద్యమానికి ప్రభావితమయ్యారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సంపూర్ణ మద్య నిషేధాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం దానిని అమలు చేశారు.
రోశమ్మకు లభించిన గుర్తింపు ఆమె ఇంటిపేరును దూబగుంటగా మార్చేసింది. గత రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. తన 93 ఏళ్ల వయసులో ఈ ఉదయం మరణించారు. కిడ్నీలు పాడైపోయిన దశలో డయాలసిస్ చేయించుకునే శక్తి లేక వైద్యానికి దూరమైన ఆమె, రెండు రోజులుగా ఆహారం తీసుకోలేదని కుటుంబ సభ్యులు తెలిపారు.












Click it and Unblock the Notifications