వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌పై కిరికిరి వద్దు, అడ్డుకుంటాం: ఈటెల, హరీష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana Rastra Samithi MLAs Etela Rajender and Harish Rao
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌పై కిరికిరి పెట్టొద్దని తెలంగాణ రాష్ట్ర సమితి డిమాండ్ చేసింది. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, హరీష్ రావులు వేర్వేరుగా మాట్లాడారు. ఎటువంటి ఆంక్షలు హైదరాబాద్ రాజధానిగా గల పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తూనే హైదరాబాద్ నగరాన్ని కేంద్రం లేదా గవర్నర్ ఆధీనంలో ఉంచుతామంటే ఒప్పుకోబోమని తెలంగాణ భవన్‌లో స్పష్టం చేశారు.

ఈ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సీమాంధ్రలో రాజధాని నిర్మాణం పూర్తిచేసుకునే వరకూ హైదరాబాద్‌లో వారి ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసుకొని, నడుపుకోవటానికి అభ్యంతరం లేదన్నారు. ఈ మేరకు తక్షణం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఛీ కొడుతున్నా ఆంధ్రా నాయకుల ఎంగిలి మెతుకులకు ఆశపడుతున్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలు చీమూనెత్తురులేని దద్దమ్మలని ధ్వజమెత్తారు.

తెలంగాణను అడ్డుకోవటానికి టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఒక నాటకంగా ఢిల్లీలో చేస్తున్న దీక్షలో టిటిడిపి నేతలు పాల్గొంటే, వారు తెలంగాణ ద్రోహులే అన్నారు. ప్రజలు వారి చేష్టలను గమనించి టిడిపికి ఇక్కడ శాశ్వతంగా గోరీ కట్టాలని కోరారు. చంద్రబాబు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు దీక్షల పేరుతో చేస్తున్న కుట్రలకు సీమాంధ్ర ప్రజలు బలి కావద్దని విజ్ఞప్తి చేశారు.

జగన్‌కు సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులపై ప్రేమలేదని, ముఖ్యమంత్రి పదవి పైనా, ప్రజా ధనం దోచుకుకోవటంపైనా ధ్యాస ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చేసి ఆంక్షలు విధిస్తే ఊరుకోమని హరీష్ రావు అన్నారు.

English summary

 Telangana Rastra Samithi MLAs Etela Rajender and Harish Rao on Monday said any move by the Centre to administer Hyderabad as joint capital will be resisted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X