వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

2019లో ఏమైనా జరగొచ్చు: బాబు సంచలనం, టిడిపి, బిజెపి మధ్య పెరుగుతున్న దూరం

By Narsimha
|
Google Oneindia TeluguNews

అమరావతి: 2019 ఎన్నికల్లో ఏమైనా జరిగే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. ఏపీ రాష్ట్రానికి అన్యాయం జరిగినా ఈ రెండు పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై బాబు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.

Recommended Video

South States Parties Check For BJP And Congress

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజకీయాల్లోకి వచ్చి ఫిబ్రవరి 27వ, తేదికి 40 ఏళ్ళు పూర్తైంది. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు పలు మీడియా ఛానెళ్ళతో మాట్లాడారు.దేశ, రాష్ట్ర రాజకీయాలపై బాబు ప్రస్తావించారు.

ఏపీ రాష్ట్రానికి న్యాయం జరగాలని చంద్రబాబునాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీ రాష్ఠ్రానికి సరైన నిధులను కేటాయించలేదని టిడిపి సహ అన్ని పార్టీలు నిరసన బాట పట్టిన సమయంలో బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు

వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చు

2019 ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో ఏమైనా జరగొచ్చని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్రం నుండి నిధుల కేటాయింపు విషయమై బిజెపి తీరుపై చంద్రబాబునాయుడు అసంతృప్తితో ఉన్నారు.ఈ తరుణంలో బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. 2014 ఎన్నికల సమయంలో రాష్ట్రానికి న్యాయం చేస్తామని ఇచ్చిన హమీని నిలుపుకోవాలని చంద్రబాబునాయుడు కేంద్రాన్ని కోరుతున్నారు. బిజెపి తీరుపై బాబు అసంతృప్తితో ఉన్నారు. అవసరమైతే రాజకీయపరమైన నిర్ణయం తీసుకొందామని కూడ బాబు ఇప్పటికే ప్రకటించారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో ఏమైనా జరగొచ్చనే విషయమై బాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి. బిజెపితో దూరమౌతారా అనే చర్చ కూడ నెలకొంది ఈ వ్యాఖ్యలను ఆషామాషీగా తీసుకోలేమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం

దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేలా జాతీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయని బిజెపి, కాంగ్రెస్ పార్టీల తీరుపై బాబు పరోక్షంగా విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమన్యాయం చేస్తే ప్రయోజనం ఉండేదని చంద్రబాబునాయుడు అభిప్రాయపడ్డారు. కానీ ఏపీ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు.నష్టపోయిన రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేలా జాతీయపార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. ఎవరికైనా.. ఏ రెండు రాష్ట్రాలకైనా అన్యాయం జరిగితే.. దేశంలోని రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. లేదంటే దేశానికి మంచిది కాదని హెచ్చరించారు.అలా అయితే దేశానికి నష్టమనే అభిప్రాయాన్ని బాబు వ్యక్తం చేశారు.

టిడిపి, బిజెపి మధ్య అగాధం

టిడిపి, బిజెపి మధ్య అగాధం

2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి మధ్య పొత్తుతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోటీ చేశారు. ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్‌డిఏ ప్రభుత్వంలోకి టిడిపి చేరింది. ఏపీ రాష్ట్రంలో బిజెపి చేరింది. అయితే కొంత కాలంగా రాష్ట్రంలో చోటు చేసుకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టిడిపి, బిజెపి మధ్య అగాధం పెరుగుతోంది. ఏపీకి కేంద్రం నుండి నిధుల కేటాయింపు విషయంలో అన్యాయం జరిగిందని టిడిపి నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో టిడిపి, బిజెపి నేతల మధ్య మాటల యుద్దం సాగుతోంది. బిజెపి నేతలు మాట్లాడుతున్న తీరుపై టిడిపి నేతలు కూడ ఎదురుదాడికి దిగుతున్నారు.

 అలా అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

అలా అయితే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

దేశంలోని ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక హోదాను ఇచ్చి ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం సరైందికాదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు చెప్పారు. ఇటీవలనే మహరాష్ట్రలోని బుందేల్‌ఖండ్‌కు ప్రధానమంత్రి సుమారు 20వేల కోట్ల ప్యాకేజీని ఇవ్వనున్నట్టు ప్రకటించారు. త్వరలోనే మహరాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు మోడీ ప్రకటన చేశారు.ఈ ప్రకటనతో ఏపీకి కూడ ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని బాబు డిమాండ్ చేస్తున్నారు. ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీని ఇస్తామని చెబితేనే తాము ప్రత్యేక హోదాకు ఒప్పుకొన్నట్టు చంద్రబాబునాయుడు గుర్తుచేశారు.

English summary
Ap chief minister Chandrababu naidu sensational comments on Tuesday. He spoke to media on Tuesday at Amaravathi. Babu opined that anything will be happened in 2019 elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X