AP 10th Supplementary Results 2023 : పదోతరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్ విడుదల..ఇలా చెక్ చేసుకోండి
ఈ ఏడాది నిర్వహించిన పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదలయ్యాయి. వీటిని ఆన్ లైన్ ద్వారా అధికారులు విడుదల చేసారు. ఇవాళ విజయవాడ నుంచి ఆన్ లైన్ లో పాఠశాల విద్యాశాఖ అధికారులు వీటిని విడుదల చేశారు. ఉదయం 11 గంటలకు ఈ ఫలితాల్ని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు.
ఈ ఏడాది మొత్తం 1.87 లక్షల మంది విద్యార్ధులు పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాశారు. వీరంతా ఫలితాల విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల వ్యాల్యూయేషన్ పూర్తి చేసిన అధికారులు.. ఇవాళ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్ధులు ఫలితాలను www.bse.ap.gov.in వెబ్ సైట్ ద్వారా లాగిన్ అయి ఫలితాలను తెలుసుకోవచ్చని అధికారులు తెలిపారు.

అలాగే స్కూల్ లాగ్ ఇన్ లో సంబంధిత స్కూల్ మొత్తం ఫలితాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ ఫలితాల మార్కుల జాబితాను డౌన్ లోడ్ చేసుకోవడానికి కూడా ఆన్ లైన్లో అవకాశం కల్పించారు. కాబట్టి విద్యార్ధులు తమ హాల్ టికెట్ నంబర్లతో లాగిన్ అయి ఫలితాలు తెలుసుకోవడంతో పాటు మార్క్ షీట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఏపీ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానంద్ రెడ్డి తెలిపారు.

ఈ ఏడాది పదో తరగతి రెగ్యులర్ పరీక్షలు పూర్తయిన తర్వాత ప్రభుత్వం విద్యార్ధులకు ఓ ఆఫర్ ఇచ్చింది. పరీక్షలు ఫెయిలైన విద్యార్ధులు నిరాశపడకుండా వారిని అడ్వాన్స్ పరీక్షలు రాయించడంతో పాటు వాటి కోసం రెగ్యులర్ గా స్కూలుకు వెళ్లి క్లాసులకు హాజరైతే సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కూడా రెగ్యులర్ గానే పరిగణించి వారికి సర్టిఫికెట్లలో ఆ మేరకు మార్పులు చేసి ఇస్తామని ప్రకటించింది.












Click it and Unblock the Notifications