పద్మకి అసలేమైంది?: పీఎస్‌లో హల్‌చల్, 'బీకామ్‌లో ఫిజిక్స్ రాసుకో' అంటూ ఫైర్

'నా మీద దాడి చేసినోళ్లను అరెస్టు చేయాలి కదా!, కళ్లు దొబ్బాయిరా మీకు, బీకామ్ లో ఫిజిక్స్ రాసుకోండిరా.." అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

అమరావతి: నిన్నటికి నిన్న మీ ఆంధ్రావాళ్లంతా ఇంతే! అంటూ ఫేస్ బుక్ లో అసహనం వ్యక్తం చేసిన ఏసీటీవో పద్మ తాజాగా తిరువూరులో హల్ చల్ చేశారు. తిరువూరులోని ఓ సిమెంటు షాపు ముందు బైఠాయించి దురుసుగా ప్రవర్తించారు. నోటికి వచ్చినట్లుగా ఆమె మాట్లాడుతున్న తీరు చూసి.. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు పద్మాచౌదరిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే అక్కడ కూడా పోలీసులకు పద్మాచౌదరి చుక్కలు చూపించింది. ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ నానా యాగి చేసింది. 'నా మీద దాడి చేసినోళ్లను అరెస్టు చేయాలి కదా!, కళ్లు దొబ్బాయిరా మీకు, బీకామ్ లో ఫిజిక్స్ రాసుకోండిరా.. హేమమాలినీ నామ సంవత్సర శుభాకాంక్షలు రా మీకందరికీ" అంటూ పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేసింది.

Ap acto officer padma choudary hulchul at tiruvuru police station

పద్మాచౌదరి తీరును గమనించిన పోలీసులు, స్థానికులు ఆమె మానసిక స్థితి సరిగా లేదని ఆరోపిస్తున్నారు. మానసిక స్థితి సరిగా లేకపోవడం వల్లే.. ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో పద్మాచౌదరి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఒక బాధ్యత కలిగిన అధికారిగా గౌవరప్రదమైన స్థానంలో ఉండి ఇలా చేయడమేంటి? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

కాగా, ఒకప్పుడు హైదరాబాద్ సచివాలయం నుంచి వెలగపూడికి సైకిల్ యాత్ర చేసి అందరి దృష్టిని ఆకర్షించిన పద్మాచౌదరి ఇలా ప్రవర్తిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+