ఏపీలో భానుడి భగభగలు.. జాగ్రత్త!
ఏపీ, తెలంగాణ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో వేసవి ప్రభావం బాగానే కనపడుతోంది. పగటివేళ ఎండల తీవ్రత గంట గంటకు అధికమౌతోంది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం బుధవారం నుంచి ఎండలు పెరగనున్నాయి. సాధారణంకన్నా ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉండనున్నాయి. వాతావరణంలో మార్పు కూడా స్పష్టంగా కనపడుతోంది. మధ్యాహ్నం వేళ భోజనం చేసిన తర్వాత ఎండకు దడిచి బయటకు వెళ్లడం కూడా మానుకుంటున్నారు.
రెండు రోజుల నుంచి ఎండల తీవ్రత గట్టిగా ఉంటోంది. శరీరం డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తెలంగాణలో పగటి ఉష్ణోగ్రత గరిష్టంగా 33 డిగ్రీలు నమోదవుతుంటే రాత్రి సమయంలో 20 డిగ్రీలుగా నమోదవుతోంది. మరోవైపు గాలులు కూడా వీస్తున్నాయి. తెలంగాణ ప్రాంతంలో వేడి కూడా ఎక్కువవుతోంది.

ఏపీలో విజయవాడ, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రి, ఏలూరు, రాయలసీమ ప్రాంతాల్లో గరిష్టంగా 33 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాత్రి వేళ 22 డిగ్రీలు ఉంటోంది. పగటి సమయంలో వాతావరణం చాలా పొడిగా ఉండటంతో దాహం ఎక్కువవుతోంది. క్రమేపీ ఎండల తీవ్రత పెరుగతోందని ఐఎండీ వెల్లడించింది. గత ఏడాది వేసవి తీవ్రత తీవ్రంగా ఉంది. ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
వేసవి తీవ్రత ఎక్కువవుతున్నకొద్దీ డీ హైడ్రేషన్ సమస్యలు పెరుగుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. రోజంతా ఎక్కువ నీళ్లు తాగాలని, పుచ్చకాయ, దోసకాయ లాంటి నీటిశాతం ఎక్కువ ఉండేవి తీసుకోవాలని, పండ్లు ఎక్కువగా తినాలని సూచిస్తున్నారు. శివరాత్రి తర్వాత వేసవి ఉష్ణోగ్రత ఇంకా పెరుగుతుందని, శరీరంలో నీటిశాతం తగ్గకుండా చూసుకోవాలని, ప్రతి మనిషి తప్పనిసరిగా రోజుకు మూడు నుంచి 4 లీటర్ల నీటిని తాగాలని, సాధ్యమైనంతవరకు పళ్ల రసాలు కూడా తీసుకుంటుండాలని సలహా ఇస్తున్నారు. ప్రతి ఒక్కరూ వీటిని పాటించాలంటున్నారు.












Click it and Unblock the Notifications