ఏపీ ఎన్నికల్లో విచిత్రం: ఆరుమంది మాజీ సీఎంల పిల్లలు పోటీ
AP election 2024: దేశంలో ఎన్నికల నగారా మోగింది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర కమిషన్ విడుదల చేసింది. దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ ఎస్ఎస్ సంధూ ఈ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశాలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ షెడ్యూల్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింది. లోక్‌సభతో పాటు మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ప్రస్తుత ప్రభుత్వాల అయిదేళ్ల పదవీ కాలం ముగిసినట్టయింది. ఓటర్లు కొత్త ప్రభుత్వాలను ఎన్నుకోవాల్సి ఉంటుంది.

ఏపీలో ఈ ఎన్నికల్లో ఓ విచత్ర పరిస్థితి నెలకొంది. ఏకంగా ఆరు మంది మాజీ/దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు ఎన్నికల బరిలో నిలిచారు. గతంలో ఈ తరహా పోటీ ఎప్పుడూ లేదనే చెప్పుకోవచ్చు. ఒకే ఎన్నికల్లో ఇంతమంది మాజీ/దివంగత ముఖ్యమంత్రుల పిల్లలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతోండటం, వారంతా వేర్వేరు పార్టీల తరఫున పోటీ చేయబోతోండటం ఆసక్తి రేపుతోంది. వారిలో ఎంతమంది గెలవగలుగుతారనేది ఉత్కంఠతగా మారింది.

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం నుంచి ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఎప్పట్లాగే కడప జిల్లా పులివెందుల నుంచి రేసులో నిలిచారు. ఎదుర్కొన్న రెండో ఎన్నికలోనే తండ్రి పేరు మీద స్థాపించిన పార్టీని అధికారంలోకి తీసుకుని రాగలిగారు. వరుసగా రెండోసారీ విజయఢంకా మోగించాలనే పట్టుదలతో ఉన్నారు.
వైఎస్సార్ తనయ వైఎస్ షర్మిల కూడా ఈ సారి ఏపీ నుంచే ఎన్నికల బరిలో నిల్చోబోతోన్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఇంకా ఖరారు కాలేదు. కడప లోక్‌సభ లేదా అదే జిల్లాలోని కమలాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. గుంటూరు జిల్లాలోని మంగళగిరి అసెంబ్లీ నుంచి రెండోసారి బరిలో నిలిచారు. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. గతంలో శాసన మండలికి నామినేట్ అయ్యారు. తండ్రి కేబినెట్‌లో మూడు శాఖల మంత్రిగా గుర్తింపు పొందారు.

టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు పిల్లలు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి వేర్వేరు పార్టీల నుంచి పోటీ పడుతున్నారు. తన కుటుంబానికి బాగా అచ్చివచ్చిన శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాలోని హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి బాలకృష్ణ.. మూడోసారి పోటీలో నిలిచారు. బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి లోక్‌సభకు పోటీ చేస్తారని తెలుస్తోంది.
దివంగత మాజీ ముఖ్యమంత్రులు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారులు సూర్యప్రకాష్ రెడ్డి, రామ్ కుమార్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తోన్నారు. నంద్యాల జిల్లాలోని డోన్ నుంచి టీడీపీ అభ్యర్థిగా సూర్యప్రకాష్ రెడ్డి, తిరుపతి జిల్లా వెంకటగిరి నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి రేసులో నిలిచారు.

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర రావు కుమారుడు నాదెండ్ల మనోహర్.. గుంటూరు జిల్లాలోని తెనాలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. జనసేన పార్టీ తరఫున ఆయన ఇక్కడి నుంచి పోటీ చేయడం ఇది తొలిసారి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ఇదే తెనాలి నుంచి రెండుసార్లు విజయం సాధించారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!?












Click it and Unblock the Notifications