AP Assembly: అసెంబ్లీలో ఆరుగురు ప్యానెల్ స్పీకర్లు-బీజేపీఎల్పీ నేతగా విష్ణు..!
ఏపీ అసెంబ్లీలో ఇవాళ కీలక నియామకాలు జరగబోతున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ స్పీకర్ చింతకాయల అయన్నపాత్రుడు వీటిపై దృష్టిపెట్టారు. ఇందులో ప్యానెల్ స్పీకర్లతో పాటు బీజేపీ శాసనసభాపక్ష నేత, విప్ ల నియామకాలు ఉన్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అసెంబ్లీని సజావుగా నిర్వహించుకునేందుకు వీలుగా ఈ నియామకాలు చేపడుతోంది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.

ఏపీ అసెంబ్లీలో ప్రస్తుతం స్పీకర్ గా అయన్నపాత్రుడు వ్యవహరిస్తుండగా.. ఆయనకు సపోర్ట్ గా ఉండేందుకు నలుగురు ప్యానెల్ స్పీకర్లను నియమించుకోవాలని ఈ మధ్యే సీఎం చంద్రబాబు ఆయనకు సూచించారు. దీంతో ఆరుగురు ప్యానెల్ స్పీకర్లను ఆయన నియమించనున్నారు. ఇందులో టీడీపీకి చెందిన వరదరాజుల రెడ్డి, జ్యోతుల నెహ్రూ, కోళ్ల లలితకుమారి, జనసేనకు చెందిన మండలి బుద్ధప్రసాద్, వైసీపీకి చెందిన దాసరి సుధ కూడా ఉన్నారు.
మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత నియామకానికి కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆమోదముద్ర వేశారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా సీనియర్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును నియమించాలని, అలాగే పార్టీ విప్ గా ఆదినారాయణరెడ్డిని నియమించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాసిన లేఖను పరిగణనలోకి తీసుకుని వీరిని నియమించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు ప్యానెల్ స్పీకర్ల జాబితాలోనూ చోటు సంపాదించడం విశేషం.












Click it and Unblock the Notifications