కోర్టు తీర్పులపై స్పీకర్ తమ్మినేని సీరియస్- బాధతోనే తీర్పులు గౌరవిస్తున్నాం- ఇక ఎన్నికలు ఎందుకు ?

ఏపీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో వెలువడుతున్న తీర్పులపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం దారుణమన్నారు. ఇలాగైతే ప్రజలు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ప్రభుత్వ విధానాలను కోర్టులు ఎలా నిర్ణయిస్తాయనే ప్రశ్నను ఆయన న్యాయస్ధానాలకు సంధించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

కోర్టులపై స్పీకర్ సీరియస్...

కోర్టులపై స్పీకర్ సీరియస్...

ఏపీలో గతేడాది వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పలు సందర్భాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు తీర్పులు వెలువడ్డాయి. హైకోర్టు, సుప్రీంకోర్టుతో పాటు కింది కోర్టుల్లో సైతం ప్రభుత్వానికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఇప్పటికే తమ అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా.. తాజాగా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా కోర్టుల తీరుపై ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తూరు పర్యటనకు వచ్చిన స్పీకర్... ప్రత్యేకంగా ఏ ఒక్క అంశాన్నీ ప్రస్తావించకుండానే కోర్టులు తాజాగా వెలువరిస్తున్న తీర్పులపై మండిపడ్డారు.

ఇక ఎన్నికలెందుకు, ఎమ్మెల్యేలెందుకు ?

ఇక ఎన్నికలెందుకు, ఎమ్మెల్యేలెందుకు ?


ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం దారుణమని స్పీకర్ తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఒక వ్యవస్ధలోకి మరో వ్యవస్ధ చొరబడటమే అన్నారు. ఇలానే కొనసాగితే ఇక ఎన్నికలు ఎందుకు, ఎమ్మెల్యేలు కావడం ఎందుకని ప్రశ్నించారు. కోర్టులే ఆపమనని అంటుంటే ఇక మిగిలిన వ్యవస్ధలన్నీ ఎందుకంటూ తమ్మినేని సంచలన కామెంట్లు చేశారు. న్యాయస్ధానాలే ప్రభుత్వాన్ని నడిపిస్తాయా అంటూ ఓ దశలో తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో ఆయన కామెంట్లు తీవ్ర కలకలం రేపాయి.

 బాధతోనే అంగీకరిస్తున్నాం....

బాధతోనే అంగీకరిస్తున్నాం....

ప్రభుత్వ విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నా వ్యవస్ధలపై గౌరవంతోనే కోర్టు తీర్పులు అంగీకరిస్తున్నామని స్పీకర్ తమ్మినేని పేర్కొన్నారు. మా నిర్ణయాలు తప్పయితే గెలిచిపించిన ప్రజలే తిరిగి ఓడిస్తారని తమ్మినేని తెలిపారు. తాము మాత్రం రాజ్యాంగాన్ని గౌరవించి ముందుకెళుతున్నామన్నారు. మేధావులు దీనిపై చర్చించాలని స్పీకర్ సూచించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు తీర్పులు వెలువడుతున్నా తాము మాత్రం బాధతోనే వీటిని ఆంగీకరిస్తున్నట్లు స్పీకర్ చెప్పకనే చెప్పారు. దీంతో ఇప్పటివరకూ ప్రభుత్వం మనసులో ఉన్న మాటను స్పీకర్ బయటపెట్టారా అన్న చర్చ మొదలైంది. మనసులో ఏదీ పెట్టుకోకుండా సూటిగా మాట్లాడతారనే పేరున్న తమ్మినేని తాజా వ్యాఖ్యలు ప్రభుత్వ వర్గాల్లోనూ సంచలనమయ్యాయి.

Recommended Video

    Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!
    ద్రవ్యబిల్లు ఆమోదించకపోవడంపై...

    ద్రవ్యబిల్లు ఆమోదించకపోవడంపై...


    శాసనసభ ఆమోదించి పంపిన ద్రవ్యవినిమయ బిల్లును శాసనమండలిలో టీడీపీ అడ్డుకోవడంపైనా స్పీకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మనీ బిల్లును ఆపడం రాజకీయాల్లో వికృత చేష్టలకు పరాకాష్ట అని స్పీకర్ వ్యాఖ్యానించారు. నా రాజకీయ జీవితంలో ఇలాంటిది చూడలేదని తమ్మినేని తెలిపారు. అసెంబ్లీ ఆమోదించిన ద్రవ్య బిల్లును మండలిలో ప్రవేశపెట్టేందుకు అవకాశం లేకపోవడంతో సమావేశాలు నిరవధికంగా వాయిదా పడిపోయాయి. దీంతో రెండో తేదీన కూడా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్ధితి తలెత్తిందని స్పీకర్ తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+