ఐదేళ్లలో ఏపీకి 9.4 లక్షల కోట్ల పెట్టుబడులు-జాతీయస్ధాయి అధ్యయనంలో వెల్లడి...

2018-19 నుండి 2022-23 వరకు ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిన పెట్టుబడి ప్రాజెక్టులపై తాజాగా జాతీయ స్ధాయిలో జరిగిన ఓ అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఇందులో ఈ ఐదు ఆర్ధిక సంవత్సరాలలో రాష్టం రూ.9.40 లక్షల కోట్లకు పైగా కొత్త పెట్టుబడి ప్రాజెక్టులను ఆకర్షించిందని అధ్యయనంలో తేలింది. ఇందులో పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రాజెక్టులు ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇవాళ ఢిల్లీలో విడుదల చేశారు.

ఆంధ్రప్రదేశ్ 2018-19 నుండి 2022-23 వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో రూ.9,41,020 కోట్ల విలువైన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులను ఆకర్షించింది. ఇందులో అత్యధికంగా 2022-23లో రూ.3,32,186 కోట్ల ప్రాజెక్టులను ఆకర్షించింది. చిన్న మధ్యతరహా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక మండలి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆర్గానిక్ ఫుడ్ ప్రొడ్యూసర్స్ & మార్కెటింగ్ ఏజెన్సీలు (COII) సంయుక్తంగా ఈ అధ్యయనం నిర్వహించాయి. ఇవాళ MSME ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తరఫున డాక్టర్ DS రావత్ ఈ ఫలితాలను విడుదల చేసారు.

ap attracted Rs.9.4 lakh crore of new investment projects in last five years, national study says

సెంటర్ ఫర్ మానిటరింగ్ ఆఫ్ ఇండియన్ ఎకానమీకి (CMIE)అందుబాటులో ఉన్న డేటా ప్రకారం ఈ ఐదేళ్లలో పెట్టుబడి రాష్ట్రంలో రూ.1,34,419 కోట్ల ప్రాజెక్టులు పూర్తయ్యాయని, పెండింగ్‌లో ఉన్న రూ.27,110 కోట్ల విలువైన ప్రాజెక్టులు పునరుద్ధరించబడ్డాయని తేలింది. 2022-23లో వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రాజెక్టుల విలువ రూ.17,90,533 కోట్లు కాగా, అమలులో ఉన్న ప్రాజెక్టులు రూ.7,51,980 కోట్లు అని నిర్ధారించారు. అలాగే ఆగిపోయిన ప్రాజెక్ట్‌లను వేగవంతం చేయడానికి హై పవర్డ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయవలసిన అవసరాన్ని అధ్యయనం గుర్తుచేసింది. వీటిని త్వరితగతిన అమలు చేస్తే మరో 2 లక్షలకు పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు సృష్టించవచ్చని తెలిపింది.

2022-23లో ప్రభుత్వం ప్రకటించిన కొత్త పెట్టుబడి ప్రాజెక్టులు రూ.23,293 కోట్లుగా ఈ అధ్యయనం తెలిపింది. అలాగే ప్రైవేట్ రంగంలో రూ.3,08,893 కోట్లుగా తేల్చింది. ప్రభుత్వ ప్రాజెక్టుల కింద 2022-23లో మొత్తం పెట్టుబడి ప్రాజెక్టులు రూ.10,65,526 కోట్లని, ఇందులో అమలులోకి వచ్చినవి రూ.5,64,868 కోట్లని తెలిపింది. ప్రైవేట్ రంగం కింద మొత్తం పెట్టుబడి ప్రాజెక్టులు రూ.7,25,006 కోట్లు గానూ, అందులో అమలులో ఉన్నవి రూ.1,87,112 కోట్లు ఉన్నాయి.

ప్రస్తుతం ఏపీలో దాదాపు 61,000 ఎంఎస్‌ఎంఈలు 5.80 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అధ్యయనం తెలిపింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చేతిపనుల రంగాలలో MSMEల వృద్ధికి భారీ అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. ఇది సమగ్రమైన, స్థిరమైన అభివృద్ధిని సూచిస్తోంది. ఉపాధి కల్పన, కొత్త ఉత్పత్తులు, సేవలు, సామాజిక పరివర్తనకు దోహదపడే మొదటి తరం సాంకేతికత ఆధారిత పారిశ్రామికవేత్తలపై దృష్టి సారించే "బూట్-అప్, స్టార్ట్-అప్ & స్కేల్-అప్" మోడల్‌పై రాష్ట్ర విధానం భవిష్యత్తులో ప్రయోజనకరమని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+