సాయిరెడ్డి సీట్లో బీజేపీ రాజ్యసభ అభ్యర్ధి ప్రకటన- అనూహ్య ఎంపిక..!

ఏపీలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎంపీ స్ధానానికి కూటమి అభ్యర్ధి ఖరారయ్యారు. ఈ స్ధానంలో కూటమి తరపున ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించడంతో ఆ పార్టీ ఇవాళ తమ అభ్యర్ధిని ప్రకటించింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ అయిన సీనియర్ నేత పాకా వెంకట సత్యనారాయణను అధిష్టానం ఎంపిక చేసింది. ఈ మేరకు రాష్ట్ర కమిటీ ప్రకటన చేసింది.

ఏపీ రాజ్యసభ అభ్యర్థి ఖరారు కోసం ఇవాళ సమావేశమైన పార్టీ ఎన్నికల కమిటీ పలు చర్చల తర్వాత రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంకటసత్యనారాయణను ఎంపిక చేసింది. రేపు మధ్యాహ్నం 3గంటలకు నామినేషన్ల గడువు ముగియనున్న నేపథ్యంలో తర్జనభర్జనల తర్వాత పాకా వెంకట సత్యనారాయణకు అవకాశం ఇవ్వాలని నిర్ణయంచారు. బీజేపీ ఏపీ కోర్‌ గ్రూప్‌ సమావేశంలో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారు.ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి యూరప్‌ నుంచి ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీలో సాధారణ కార్యకర్తకు అవకాశం ఇవ్వాలనే పాగాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

ap bjp announces senior leader paka Venkata satyanaraya as rajya sabha candidate

ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా పాక వెంకట సత్యనారాయణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ముందు నుంచి ఆర్ఎస్ఎస్ తో ఉన్న సంబంధాలు ఆయనకు కలిసి వచ్చాయని పార్టీ వర్గాలు తెలియజేశాయి. ఇప్పటికే భూపతిరాజు శ్రీనివాసవర్మ రూపంలో సాధారణ కార్యకర్తకు ఎంపీగా, కేంద్రమంత్రిగా అవకాశం కల్పించిన బీజేపీ.. ఇప్పుడు పాకా సత్యనారాయణ ఎంపికతో మరో మెసేజ్ పంపినట్లవుతోంది. మరో మూడున్నరేళ్లు ఆయన ఎంపీగా కొనసాగబోతున్నారు. ఎమ్మెల్యేల కోటాలో పాకా సత్యనారాయణ ఎంపీ కావడం లాంఛనమే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+