పేరుకు బీజేపీ అధ్యక్షురాలే గానీ..
Andhra Assembly elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఏపీలో అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ఆ దిశగా ముమ్మర కసరత్తు సాగిస్తోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే నాలుగు విడతల్లో 68 లోక్‌సభ/అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
తెలుగుదేశం పార్టీ- జనసేన తమ అభ్యర్థుల జాబితాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తరువాతే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించింది. షెడ్యూల్ వెలువడటానికి, పోలింగ్ తేదీకి మధ్య సుమారు 40 రోజుల వరకు వ్యవధి ఉంటుందని, జనసేనతో సీట్ల పంపకాల వ్యవహారాన్ని కూడా అప్పుడే తేల్చేయాలని టీడీపీ భావిస్తోంది.

ఈ రెండు పార్టీలతో కలిసి కూటమి కట్టాలని ఉవ్విళ్లూరుతోంది ఏపీ బీజేపీ. టీడీపీ-జనసేనతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ దిశగా బీజేపీ రాష్ట్రశాఖ అధ్యక్షురాలు, చంద్రబాబు నాయుడికి సమీప బంధువు దగ్గుబాటి పురంధేశ్వరి చేయని ప్రయత్నం అంటూ ఏదీ లేదు. టీడీపీతో పొత్తు కోసం ఇప్పటికే పలు సంకేతాలను పంపించారామె.
టీడీపీతో కలిసి వెళ్లడమే మంచిదంటూ బాహటంగా ప్రకటించిన సందర్భాలు చాలా ఉన్నాయి. పార్టీ జాతీయ నాయకత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలొచ్చాయి. ఎన్నికల గడువు సమీపిస్తోన్నప్పటికీ- టీడీపీ పొత్తు ఉద్దేశంతోనే అభ్యర్థల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయట్లేదనే అభిప్రాయాలు సైతం లేకపోలేదు.

ఈ పరిణామాల మధ్య పురంధేశ్వరి.. ఓ అడుగు ముందుకేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో స్థానిక తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు పయ్యావుల కేశవ్‌తో సమావేశం అయ్యారు. క్షేత్రస్థాయిలో ఓట్ల బదలాయింపుపై చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ఆర్సీపీ ఎదుర్కొనే విషయంలో పరస్పరం సహకరించుకోవాలనే, ఉమ్మడిగా పోరాడాలని కోరినట్లు సమాచారం.
అనంతరం ఉరవకొండలో పయ్యావుల కేశవ్‌తో కలిసి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు పురంధేశ్వరి. ఈ కార్యక్రమంలో మెడలో పసుపు కండువాతో కనిపించారు పయ్యావుల. భారీ ర్యాలీలో పాల్గొన్నారు. బీజేపీ, ఎన్టీఆర్ అభిమానులు ఇందులో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని పురంధేశ్వరి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications