జగన్ వ్యాఖ్యలకు సోము వీర్రాజు కౌంటర్- బీజేపీ అండ ఉండదన్న వ్యాఖ్యలపై...
ఏపీలో అమిత్ షా, జేపీ నడ్డా పర్యటనలు, అధికార వైసీపీపై విమర్శల తర్వాత ఇరు పార్టీల మధ్య బంధం చెడిందనే చర్చ ముమ్మరంగా సాగుతోంది. దీంతో పాటే వైసీపీతో ఇన్నాళ్లూ బీజేపీ బంధం కొనసాగించిందనే ప్రచారం కూడా తెరపైకి వస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర నేతలు దీనిపై సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్ధితి ఎదురవుతోంది. దీంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇవాళ వైసీపీతో బంధంపై స్పందించారు.
ఏపీలో బీజేపీ జగన్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తెలిపారు.తాము ఏనాడు జగన్‌ను సమర్ధించలేదన్నారు. ఇప్పటికే జేపీ నడ్డాతో పాటు ఏపీకి వచ్చిన కేంద్రమంత్రులంతా వైసీపీ ప్రభుత్వ విధానాల్ని విమర్శించారని సోము గుర్తుచేశారు. ఏపీలో జరిగే విషయాల్ని ఎప్పటికప్పుడు అమిత్ షా దృష్టికి తీసుకుని వెళ్తున్నట్లు సోము తెలిపారు. దాన్ని బట్టే ఆయన ఏపీ టూర్ లో స్పందించారన్నారు.

బీజేపీ మనతో ఉండకపోవచ్చంటూ జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. బీజేపీ ఎప్పుడు మీతో ఉందో చెప్పాలన్నారు.జగన్‌కు అలా మాట్లాడే హక్కు లేదన్నారు. అలాగే పవన్ తమకు మద్దతు తెలపరని కూడా జగన్ చెప్తున్నారని, మీకు పవన్ ఎందుకు మద్దతివ్వాలని సోము ప్రశ్నించారు. బీజేపీకి మిత్రుడిగా ఉన్న పవన్ పై వైసీపీ నేతలు విమర్శలు చేస్తే సహించబోమని సోము హెచ్చరించారు.
ఏపీలో బీజేపీని బలహీనపర్చేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని, ప్రధాని మోదీ దగ్గరకెళ్లి డబ్బులు తీసుకుంటూ ఆయన పేరునే చెప్పడం లేదని సోము విమర్శించారు. జగన్, పేర్ని నాని ఇద్దరూ పొంతన లేకుండా తలోమాట మాట్లాడుతున్నారని సోము ఆరోపించారు. తాము ప్రభుత్వాన్ని విమర్శించినప్పుడల్లా ప్రత్యేక హోదా, రైల్వే జోన్ గుర్తొస్తొందా అని వైసీపీ నేతల్ని ప్రశ్నించారు. కేంద్రం ఏపీకి చేస్తున్న అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. కేంద్రం మద్దతు లేకుండా ఏపీలో ఏ ప్రభుత్వం కూడా అభివృద్ధి చేయలేదన్నారు.
-
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!!












Click it and Unblock the Notifications