బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి షాక్..! డ్రగ్స్ కేసులో కొడుకు అరెస్ట్?
ఏపీలో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఇవాళ భారీ షాక్ తగిలింది. ఆయన కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ కేసులో పోలీసులకు పట్టుబట్టారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం డీఅడిక్షన్ సెంటర్ కు తరలించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
హైదరాబాద్ లోని నార్సింగి వద్ద పోలీసులు డ్రగ్స్ పై తనిఖీలు నిర్వహిస్తున్నారు. వీటిలో ఏపీ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పట్టుకున్నారు. అనంతరం నిర్వహించిన వైద్య పరీక్షల్లో సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి నిబంధనల ప్రకారం డీఅడిక్షన్ సెంటర్ కు తరలించారు. ఆ సమయంలో సుధీర్ రెడ్డితో పాటు ఉన్న మరొక వ్యక్తిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

గతంలోనూ మాదక ద్రవ్యాల వినియోగం కేసుల్లో సుధీర్ రెడ్డి పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తోంది. అయితే అప్పట్లో ఎలాగోలా తప్పించుకున్న ఆయన.. ఇవాళ మరోసారి డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడినట్లు సమాచారం. గతంలో టీడీపీ, వైఎస్సార్సీపీలో ఉన్న ఆదినారాయణరెడ్డి గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులో తన కుమారుడు పట్టుబడటంతో దీనిపై బీజేపీ లేదా కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications