టీడీపీపై మారుతున్న పురందేశ్వరి స్వరం - ఢిల్లీ డైరెక్షన్, ఆట మొదలు..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం అనూహ్య మలుపులు తిరుగుతోంది. జగన్ లక్ష్యంగా టీడీపీ, జనసేన పొత్తు ఖాయం చేసుకున్నాయి. బీజేపీ తమతో కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నాయి. బీజేపీ నుంచి అధికారికంగా ఎటువంటి స్పష్టత లేదు. ఇటు పురందేశ్వరి సైతం వైసీపీని టార్గెట్ చేయటం ద్వారా ఈ మూడు పార్టీల పొత్తు ఖాయమనే ప్రచారం సాగుతోంది. ఈ సమయంలోనే పురందేశ్వరి తొలి సారిగా పరోక్షంగా టీడీపీని టార్గెట్ చేసారు. దీంతో..కొత్త రాజకీయం తెర మీదకు వస్తోంది.
పురందేశ్వరి వ్యాఖ్యలు : బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పార్వతీపురం మండలం అడ్డపుశీల లో టిడ్కో ఇళ్ళను పరిశీలించారు. టిడ్కో ఇళ్ళ ప్రాంతంలో నిషేధిత ప్రాంతం గా బోర్డు అక్కడ ఉండడాన్ని పురంధేశ్వరి చూసి న తరువాత వెంటనే అక్కడ ఉన్న హౌసింగ్ అధికారిని నిలదీశారు. మీ ఉద్దేశ్యం ఏమిటి ఇలాంటి బోర్డు లు ఇక్కడ ఏర్పాటు చేయడం ఏంటి అంటూ తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. టిడ్కో ఇళ్ళ కు సొమ్ము లు కట్టించుకుని టిడ్కో ఇళ్ళను ఇవ్వక, కనీసం ఇల్లు కట్టుకోవడానికి జాగా ఇవ్వలేదని బాదితులు హౌసింగ్ అధికారి ముందు పురంధేశ్వరి కి ఫిర్యాదు చేసారు. దీంతో, ఆమె వైసీపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజల పక్షాన రాజీలేని పోరాటం బిజెపి మాత్రమే చేస్తోందని పురందేశ్వరి చెప్పుకొచ్చారు.

పరోక్ష కామెంట్స్ : పంచాయతీ ల నిధులు దగ్గర నుంచి ఇసుక, లిక్కర్ మాఫియా పై కూడా పోరాటం బిజెపి మాత్రమే చేస్తోందని వివరించారు. దీని ద్వారా పరోక్షంగా టీడీపీ, జనసేన ప్రజల పక్షాన పోరాటాలు చేయటం లేదని పురందేశ్వరి అభిప్రాయంగా స్పష్టం అవుతోంది. ఇప్పటి వరకు ఈ రెండు పార్టీల పైన పరోక్షంగానూ పురందేశ్వరి ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. తాజాగా టీడీపీ, జనసేన కలిసి ఉమ్మడి మేనిఫెస్టో..సీట్ల పంపకాల పైన చర్చలు..నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్న వేళ బీజేపీ అప్రమత్తమైంది. ఇప్పటికే తెలంగాణలో తమకు జనసేనతో పొత్తు ఉండదని ఆ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఏపీలో పొత్తుల పైన అధికారికంగా స్పష్టత ఇవ్వలేదు.

మూడ్ మారుతోందా : ఈ నెల 21న బీజేపీ ముఖ్య నేతల సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశానికి పురందేశ్వరి సైతం హాజరవుతారని తెలుస్తోంది. ఏపీలో రాజకీయ కార్యాచరణ..వ్యూహాల పైన ఈ సమావేశంలో స్పష్టత ఇస్తారని తెలుస్తోంది. అయితే, పవన్ సైతం బీజేపీ కంటే టీడీపీకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు బీజేపీ నేతలు భావిస్తున్నారు. బీజేపీ మూడ్ గుర్తించిన తరువాతనే పురందేశ్వరి పరోక్షంగా టీడీపీని లక్ష్యంగా చేసుకుంటే ప్రజల పక్షాన పోరాటం చేయటం లేదనే వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి. ఏపీలో పొత్తుల పైన వచ్చే వారం మరింత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications