అన్యాయం చేశారు, ఇంకా ఇవన్నీ రావాలి, రాజధాని లేకపోవడంతో: బడ్జెట్ ప్రసంగంలో గవర్నర్
Recommended Video

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు, విభజన చట్టంలోని హామీలు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు.
చదవండి: భయం.. భయం!: 2019 బిగ్ ప్లాన్, కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ వెనుక అసలు కథ ఇదీ!!
విభజన చట్టంలోని హామీలు ఇంకా అమలు కావాలని గవర్నర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ అమలు కావాలన్నారు. విభజనతో ఏపీ చాలా నష్టపోయిందని చెప్పారు. ఆస్తులను ప్రాంతాల వారిగా, అప్పులను జనాభా ప్రాతిపదికన పంచారని చెప్పారు.
చదవండి: అలా చెప్పినప్పుడు బాధపడ్డా, కేసీఆర్‌కు ఆ శక్తి ఉంది: థర్డ్ ఫ్రంట్‌పై పవన్ కళ్యాణ్

మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నాం
విభజన హామీల కోసం మూడున్నరేళ్లుగా ఎదురు చూస్తున్నామని నరసింహన్ చెప్పారు. విభజన హామీలపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. విభజన సమయంలో చట్టం చేసిన ప్రతి ఒక్కటీ అమలయ్యే వరకు తమ ప్రభుత్వం వెనుకడగు వేయదని చెప్పారు.

ఇప్పటికీ పరిష్కారం కాలేదు
విభజన సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాలేదన్నారు. సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. విభజన తర్వాత ఇఫ్పడిప్పుడే ఏపీ క్రమంగా కోలుకుంటోందని చెప్పారు. 56 శాతం జనాబాకు 46 శాతం రాబడి ఇవ్వడం అన్యాయమని చెప్పారు.

ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయాం, హోదా ఇవ్వాల్సిందే
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని చెప్పారు. రెవెన్యూ లోటు, తక్కువ ఆదాయంతో ఏపీకి ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఆదాయం, ఆస్తుల పంపిణీలో హేతుబద్దత పోయిందన్నారు. రాజధాని లేకుండా రాష్ట్రం ఏర్పాటు కావడంతో ఆర్థిక కేంద్రాన్ని కోల్పోయామని చెప్పారు. ఏపీకి హోదా ఇవ్వాల్సిందే అన్నారు.

అలుపెరగని పోరాటం
ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. విభజన సమస్యల కోసం మూడేళ్లుగా అలుపెరగని పోరాటం చేశామని చెప్పారు. పొరుగు రాష్ట్రాలతో సమానస్థాయికి వచ్చే వరకు ఏపీకి కేంద్రం సాయం చేయాలని చెప్పారు. ఏపీలో విద్యుత్ కొరత లేకుండా చూసుకున్నామని చెప్పారు.

ఇవి నెరవేర్చాలి
తొమ్మిది, పది షెడ్యూళ్ల ఆస్తుల విభజన జరగలేదన్నారు. కేంద్ర నిధులతో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. హోదా, ఆర్థిక లోటు, రైల్వే జోన్, గ్రీన్ ఫీల్డ్ క్రూడాయిల్ రిఫైనరీ, పెట్రో కమికల్ కాంప్లెక్స్, రాజధానికి ఆర్థిక సాయం ఇప్పటి వరకు నెరవేరలేదన్నారు. నియోజకవర్గాల పునర్విభజన, దుగరాజుపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంటు, విశాఖ-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖ, విజయవాడ మెట్రో, అమరావతికి ర్యాపిడ్ రైలు - రోడ్డు అనుసంధాన కేంద్రం నెరవేర్చాల్సి ఉందన్నారు.

తలసరి ఆదాయం తగ్గింది
దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ తలసరి ఆదాయం 35 శాతం తగ్గిందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు అన్నారు. వ్యవసాయ రంగంలో గణనీయమైన అభివృద్ధి సాధించామన్నారు. విద్యుత్ కొరతను అధిగమించామని చెప్పారు. మూడేళ్లలో 11.31 శాతం వృద్ధి రేటు సాధించామని చెప్పారు.

అగ్రిగోల్డ్ స్కాంపై
వాల్మికీ, బోయలను ఎస్టీల్లో చేర్చడానికి ప్రభుత్వం సిఫార్సు చేసిందని చెప్పారు. అతిపెద్ద స్కాంలలో అగ్రిగోల్డ్ ఒకటి అని, చాలామందిని మోసం చేసిందని చెప్పారు. అగ్రిగోల్డ్ అన్యాయం వల్ల చనిపోయిన వంద కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అన్నారు. రూ.6 వేల కోట్లకు పైగా ఆస్తులు ఏపీకి చెందినవే అన్నారు. గవర్నర్ జైహింద్ అంటూ












Click it and Unblock the Notifications