వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలా చెప్పినప్పుడు బాధపడ్డా, కేసీఆర్‌కు ఆ శక్తి ఉంది: థర్డ్ ఫ్రంట్‌పై పవన్ కళ్యాణ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు అంకురార్పణ చేస్తే సాటి తెలుగువాడిగా తాను కచ్చితంగా మద్దతు పలుకుతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం చెప్పారు. ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపిన కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు.

కేసీఆర్ ప్రత్యేక హోదాకు మద్దతు పలికితే తాము హైకోర్టుకు మద్దతు పలుకుతామని, విశాఖ రైల్వే జోన్‌కు మద్దతిస్తే తాము బయ్యారం పరిశ్రమకు అండగా ఉంటామని ఇలా పరస్పరం ముందుకు సాగాల్సి ఉందని చెప్పారు. విడిపోయినా ఎలాంటి గొడవలు లేకుండా, మనస్పర్థలు లేకుండా సాగిపోవాలన్నారు.

మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్మోడీ దెబ్బతో గుబులు, నిన్న బాబు, నేడు కేసీఆర్-స్టాలిన్ హెచ్చరిక: దండయాత్రకు చెక్

ఏపీ ప్రజలు మరిచిపోరు

ఏపీ ప్రజలు మరిచిపోరు

రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో సామరస్యం కోసం కేసీఆర్ చేసిన విధానం, కృషి అభినందనీయమని పవన్ కళ్యాణ్ అన్నారు. కేసీఆర్‌ను ఏపీ ప్రజలు మరిచిపోరని చెప్పారు. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపినందుకు థ్యాంక్స్ అన్నారు. హోదాకు మద్దతు ద్వారా తెలుగు ప్రజలపై ఆయనకు ఉన్న అభిమానం కనిపించిందన్నారు.

అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుడుతాయి

అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుడుతాయి

కేసీఆర్ చెప్పిన థర్ట్ ఫ్రంట్ తన దృష్టికి వచ్చిందని పవన్ కళ్యాణ్ అన్నారు. అసలు ప్రాంతీయ పార్టీలు ఎందుకు పుడుతున్నాయని ప్రశ్నించారు. నాడు అంజయ్యను అగౌరవపరచకుంటే టీడీపీ పుట్టేది కాదని, తెలంగాణ ఇచ్చి ఉంటే లేదా సమానంగా చూస్తే టీఆర్ఎస్ పుట్టి ఉండేది కాదని వ్యాఖ్యానించారు. జాతీయ పార్టీలు ప్రాంతీయ ప్రజల ఆకాంక్షలను గౌరవించకుంటే ప్రాంతీయ పార్టీలు పుట్టుకు వస్తాయన్నారు. అందుకే జనసేన పుట్టిందన్నారు.

అమిత్ షా బీజేపీలో చేరమన్నారు, బాధపడ్డా

అమిత్ షా బీజేపీలో చేరమన్నారు, బాధపడ్డా

బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంటుందని, తమ పార్టీలోకి రావాలని అమిత్ షా గతంలో తనకు చెప్పారని, అలా చెప్పినందుకు తనకు కొంత బాధ కలిగిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏ ఉనికి అయితే (జనసేన) బీజేపీకి, టీడీపీకి 2014లో సహకరించిందో ఆ ఉనికిని చంపేయాలని చూస్తే ఎలాగని ప్రశ్నించారు. ఎప్పుడైతే జాతీయ పార్టీలు ప్రాంతీయవాసుల మనోభవాలను అర్థం చేసుకోవో అప్పుడు ప్రాంతీయ పార్టీలు, థర్డ్ ఫ్రంట్‌లు ఏర్పడుతున్నాయన్నారు.

థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఉండాలి

థర్డ్ ఫ్రంట్ కచ్చితంగా ఉండాలి

యూపీఏ హయాంలో దేశం అస్తవ్యస్తంగా మారిందని, అలాంటప్పుడు బీజేపీ నేతృత్వంలో ఎన్డీయే ముందుకు వచ్చినప్పుడు చాలామంది మద్దతు పలికారని పవన్ అన్నారు. కానీ ప్రజల ఆకాంక్షలు పట్టించుకోవడం లేదన్నారు. ఓ కొత్త రక్తం రాజకీయాల్లో రావాలని లేదంటే బూజు పట్టిన విధానం అలాగే ఉంటుందన్నారు. అందుకు థర్డ్ ఫ్రంట్ కూడా ఉండాలని చెప్పారు. రాజకీయాల్లో కచ్చితంగా ప్రత్యామ్నాయం ఉండాలని జనసేన నమ్ముతుందన్నారు. ఫ్రంట్‌పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోందన్నారు.

సాటి తెలుగువాడిగా, ఆ శక్తి కేసీఆర్‌కు ఉంది

సాటి తెలుగువాడిగా, ఆ శక్తి కేసీఆర్‌కు ఉంది

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న కేసీఆర్‌కు సాటి తెలుగువాడిగా తాను మనస్ఫూర్తిగా మద్దతిస్తున్నానని, ఆయనను నమ్ముతున్నానని చెప్పారు. థర్డ్ ఫ్రంట్ నడిపే సామర్థ్యం కేసీఆర్‌కు ఉందని తాను భావిస్తున్నానని చెప్పారు. దశాబ్దకాలం పాటు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన పెద్ద నాయకుడు కేసీఆర్ అని, దేశవ్యాప్తంగా పలు పరిచయాలు ఉన్న వ్యక్తి అని, భారత దేశ, స్థానిక సమాజం పట్ల లోతైన అవగాహన ఉన్న వ్యక్తి కేసీఆర్ అని, ఇలాంటి వ్యక్తి నడిపితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం అవసరం

ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం అవసరం

దశాబ్దం పాటు తెలంగాణ కోసం ఉద్యమించిన కేసీఆర్ నేతృత్వంలో ఒక్క రక్తపు చుక్క కిందపడలేదని, అలాంటి వ్యక్తికి తాను మద్దతిస్తున్నానని పవన్ కళ్యాణ్ చెప్పారు. భారత రాజకీయాలను, ప్రజా సమస్యలను చాలా సున్నితంగా ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం అవసరమన్నారు.

2019లో ప్రాంతీయ పార్టీలదే

2019లో ప్రాంతీయ పార్టీలదే

2019లో కచ్చితంగా ప్రాంతీయ పార్టీలు లేకుండా రాజకీయాలు ముందుకు సాగవని పవన్ కళ్యాణ్ జోస్యం చెప్పారు. ఏపీ, తెలంగాణ తమిళనాడు పరిస్థితులను చూస్తే వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం ఉంటుందన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌కు అంకురార్పణ చేస్తే కచ్చితంగా మద్దతిస్తానని చెప్పారు.
రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయని, టీడీపీ, వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం టీఆర్ఎస్ ఎంపీల సహకారం తీసుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు.

English summary
Jana Sena cheif Pawan Kalyan on Sunday said that Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar Rao have ability to run Third Front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X