Vijay: సీఎంగా తొలి సభలోనే విజయ్ ఫైర్..! స్టాలిన్ కు వార్నింగ్..! బ్లాక్ కోటు వెనుక ?

తమిళనాడులో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే అధినేతగా అనూహ్య పరిణామాల మధ్య సీఎం పదవి చేపట్టిన విజయ్ (Vijay).. పాలనలో సైలెంట్ గా దూసుకుపోతున్నారు. కానీ తొలిసారి ఆయన ఇవాళ తిరుచ్చిలో నిర్వహించిన బహిరంగసభలో మాత్రం అందుకు విరుద్దంగా ఫైర్ మోడ్ లోకి వచ్చేశారు. రాష్ట్రంలో గత డీఎంకే పాలనలో నెలకొన్న పరిస్ధితుల నుంచి మొదలుపెట్టి తన భవిష్యత్ వ్యూహాల వరకూ అన్ని అంశాలపైనా విజయ్ క్లారిటీ ఇచ్చేశారు.

తాను ప్రజలను తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టించడానికి లేదా మోసం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని విజయ్ తెలిపారు. మీ పక్షాన నిలబడి, మీ కోసం పనిచేయడానికే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దాని గురించి ఎలాంటి సందేహం గానీ, అస్పష్టత గానీ లేదన్నారు. డీఎంకే, అనేక ఇతర పార్టీలు శాంతిభద్రతలు సరిగ్గా లేవని, ఫలానాది సరిగ్గా పనిచేయడం లేదని చెబుతూ, మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నాయని, కానీ మీరు సరిగ్గా ఏమి మిగిల్చి వెళ్లారు? ఒక్క పట్టణాన్ని గానీ, వీధిని గానీ వదలకుండా, మీరు మాదకద్రవ్యాల సంస్కృతిని ప్రతిచోటా వ్యాపించడానికి అనుమతించారని చురకలు అంటించారు.

Vijay s First Speech as Tamil Nadu CM Hits DMK on Drugs Vows to Never Compromise on State Rights

డ్రగ్స్ కల్చర్ ను ప్రారంభ దశలోనే నియంత్రించి ఉండాల్సిందని, మీరు అలా చేసి ఉంటే, ఇంతమంది బాలికలు, మహిళలు బాధపడాల్సిన లేదా ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితికి మనం చేరుకునేవాళ్ళమా? అని స్టాలిన్ ను ప్రశ్నించారు. ఇవన్నీ చేసిన తర్వాత, ఇప్పుడు నిందను తనపై మోపుతున్నారన్నారు. స్టాలిన్ లాంటి సందిగ్ధత ఎప్పటికీ ఉండదన్నారు. లౌకికవాద సూత్రంపై రాజీకి ఆస్కారం లేదని, తాము రాష్ట్ర హక్కులను ఎప్పటికీ వదులుకోమని విజయ్ తెలిపారు. నదీ జలాలపై తమ హక్కులను ఎప్పటికీ వదులుకోమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సామాజిక న్యాయం, సమాన న్యాయం, సమానత్వం అమలు చేస్తామన్నారు.

Vijay s First Speech as Tamil Nadu CM Hits DMK on Drugs Vows to Never Compromise on State Rights

ఇప్పుడు ప్రజలు తనను పెరంబూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అని పిలుస్తున్నారని, అది కేవలం ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారమే అన్నారు. కానీ తన వరకు అయితే, తిరుచిరాపల్లి నియోజకవర్గ ప్రజలు కూడా తన హృదయానికి చాలా చాలా దగ్గర అని విజయ్ తెలిపారు. తాను కోటు వేసుకోవడం గురించి చాలా మంది మాట్లాడుతున్నారని, ఎందుకు? మనం కోటు, సూట్ వేసుకోకూడదా? కేవలం అధికారంలో ఉన్నవారు, ఆధిపత్య శక్తులు మాత్రమే కోట్లు, సూట్లు వేసుకోవాలా? ఈ రెండు రంగులు మనిషి మనసులోని రెండు పార్శ్వాలను ప్రతిబింబిస్తాయన్నారు. తనకు ఫ్యాన్సీ రంగుల దుస్తులు వేసుకోవాలని లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+