కల్తీ నెయ్యి అంశం పై ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం, ఇక ఫిక్స్..!!

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. కొంత కాలంగా సంచలనంగా మారిన కల్తీ నెయ్యి అంశం పైన సిట్ విచారణ చేసింది. కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. అప్పట్లో పని చేసిన అధికారుల పై చర్యలను సిఫారసు చేసింది. దీనికి అనుగుణంగా ఈవోగా ఉన్న అనీల్ కుమార్ సింఘాల్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ వ్యవహారం రాజకీయ వివాదంగా మారటంతో తాజాగా ప్రభుత్వం ఈ అంశంలో అసలు దోషులను తేల్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయ పడింది. ఇందు కోసం కేబినెట్ లో సుదీర్ఘ చర్చ తరువాత కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది.

కల్తీ నెయ్యి నివేదిక పైన మంత్రివర్గ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు. సిట్ ఇచ్చిన నివేదికను అధికారులు మంత్రులకు వివరించారు. చర్చ తరువాత మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. సిట్ నివేదికలోని లోపాలను సరిచేసి, అసలు సూత్రధారులను కనుగొనేందుకు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. నెయ్యి టెండర్ నిబంధనలను మార్చడం పైనా మంత్రివర్గంలో చర్చ జరిగింది. టెండర్ నిబంధనలను మార్చినప్పటికీ ఈఓగా ఉన్న సింఘాల్ అభ్యంతరం వ్యక్తం చేయకపోవడంపై పలువురు మంత్రులు ప్రశ్నలు లేవనెత్తారు. 2022లో సీఎఫ్‌టీఆర్‌ఐ నివేదికలో నెయ్యి కల్తీ జరిగిందని నివేదిక వచ్చినా పట్టించుకోకపోవడంపై చర్చించారు. అప్పటి అధికారులు బాలాజీ, సుబ్రహ్మణ్యం దానిని పక్కన పెట్టారని నివేదికలో పేర్కొన్నారు. ఎన్‌డీడీబీ నివేదికలో యానిమల్ ఫ్యాట్ ఉందని తేలిందని, అదే విషయాన్ని ముఖ్యమంత్రి చెప్పారని మంత్రులు తెలిపారు. సిట్ నివేదికలో కొంతమంది పేర్లు పేర్కొన్నా.. చివరి ఫైండింగ్స్‌లో వాటిని పేర్కొనకపోవడంపై చర్చ జరిగింది. ఈ లోపాలన్నింటిపై కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది.

ap-cabinet-big-decision-to-appoint-enquiry-commission-over-laddu-adulteration-in-tirumala-row

నివేదిక ఆధారంగా చర్యలు

కాగా, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ నివేదికను సాధ్యమైనంత త్వరగా సమర్పించాలని ఆదేశించింది. టెండర్ ప్రక్రియలో లోపాలపై దృష్టి సారించాలని కమిటీకి మంత్రిమండలి సూచించింది. సహకార డెయిరీలను పక్కన పెట్టేందుకు పథకం రూపొందించారని కేబినెట్ పేర్కొంది. సహకార డెయిరీలను పక్కన పెట్టడం ద్వారా బోగస్ డెయిరీలను రంగంలోకి తీసుకువచ్చారని అధికారులు వివరించారు. దీనిపైనా ఎంక్వైరీ కమిటీ దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. అడ్వకేట్ జనరల్, సీనియర్ అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అప్పటి చైర్మన్ సుబ్ బారెడ్డి పాత్ర గురించి సిట్ నివేదికలో ఏమైనా పేర్కొన్నారా అనే అంశం పైన డిప్యూటీ సీఎం పవన్ ఆరా తీసినట్లు సమాచారం. అయితే, అసలు సూత్రధారులను వెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. సిట్ నివేదికలో లోపాలు ఉన్నాయని, అసలు సూత్రధారులను బయటకు తీసుకురాలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ విషయాలను బహిర్గతం చేసేందుకే కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు అప్పగించామని ముఖ్యమంత్రి తెలిపారు. నివేదిక వచ్చిన వెంటనే ఎవరిపై చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తామని స్పష్టం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+