అమరావతి భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కు - కీలక నిర్ణయాలు..!!

ఏపీ మంత్రివర్గ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్ లో జరిగిన సమావేశంలో తాజా పరిణామాల పైన చర్చించారు. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులను ఆమోదించారు. అజెండాలోని 13 అంశాలకు ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలో భూ సేకరణ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు.

ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర పడింది. ఆగస్టు 31లోగా అర్బన్ లోకల్ బాడీలు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ, ఏపీ సీఆర్డీఏ, రాజధాని ఏరియా మినహాయించి అనథరైజ్‌గా నిర్మించిన భవనాలకు పినలైజేషన్ విధించే ప్రతిపాదనపై కేబినెట్ ఆమోదం తెలిపింది. నాలా ఫీజు రద్దుకు సంబంధించి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌లోని వివిధ చట్టాలను సవరిస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు.

ap-cabinet-key-decisions-over-amaravati-and-bills-to-introduce-in-the-assembly

వైఎస్సార్ తాడిగడప మున్సిపాలిటీ, తాడిగడప మున్సిపాలిటీగా మార్చే డ్రాఫ్ట్ బిల్లుకు పలు సవరణలు చేస్తూ కేబినెట్‌లో ఆమోదం ముద్రపడింది. రాజధాని అమరావతి ప్రాంతంలో పెద్ద ప్రాజెక్టుల అమలుకు ప్రత్యేక వాహక నౌకలను ఏర్పాటు చేస్తూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతి పరిధిలో గతంలో 343 ఎకరాలకు సంబంధించి ఇచ్చిన భూ సేకరణ నోటిఫికేషన్‌ను వెనక్కి తీసుకునేందుకు క్యాబినెట్‌లో గ్రీన్ సిగ్నల్ వచ్చింది.

మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 1955, ఏపీ మున్సిపాలిటీ యాక్ట్ 1965 లకు ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 ను అనుసరించి ఓటర్ల జాబితా తయారీకి మరో మూడు తేదీలను ఖరారు చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలియజేశారు. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపుకు సంబంధించి మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలిపారు.

పంచాయతీరాజ్ శాఖలో పలు భూములను అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్‌కు కన్వర్షన్‌కు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు కేబినెట్‌లో ఆమోదముద్ర పడింది. ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ బిల్ 2025లో పలు సవరణలు చేస్తూ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం తెలపడంతో పాటు.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందుకు తీసుకువచ్చే పలు బిల్లులకు కూడా మంత్రిమండలిలో ఆమోదముద్ర పడింది. లిఫ్ట్ పాలసీ కింద చిన్న సంస్థల ఏర్పాటుకు భూములు కేటాయింపుకు సంబంధించి మంత్రిమండలిలో చర్చించి ఆమోదం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+