నేడే ఏపీ క్యాబినెట్ భేటీ .. నూతన ఇసుక పాలసీ, ఆర్టీసీ విలీనం తదితర కీలక అంశాలపై చర్చ

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ కానుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ఏపీ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం కేబినెట్ తెలపనుంది . ఇక ఈ క్యాబినెట్ భేటీలో చర్చించనున్న కీల‌క అంశాలు చూస్తే గురువారం నుంచి అమల్లోకి రానున్న నూతన ఇసుక విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. అలాగే ఏపీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశానికి సంబంధించి రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయరెడ్డి కమిటీ నివేదికపై కూడా మంత్రివర్గంలో చర్చ జరగునుంది.

విలీనంలో భాగంగా సంస్ధ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా చేర్చుకునే అంశంపై మంత్రివర్గ భేటీలో నేడు క్లారిటీ రానుంది. ఎస్సీ, ఎస్టీల‌కు ప్ర‌త్యేక క‌మీష‌న్ల ఏర్పాటు, టిటిడి పాల‌క మండ‌లి స‌భ్యుల సంఖ్య ను 19 నుండి 25 కు పెంచే అంశాలపై ఆర్డినెన్స్ పై మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ప్రభుత్వం ప్రజలకు అందించాలని నిర్ణయించిన పథకాలపై క్యాబినెట్ భేటీలోచర్చ జరగనుంది. అదే విధంగా అక్టోబర్ 2 నుంచి గ్రామ సచివాలయాల ఏర్పాటు కానున్న నేపథ్యంలో వీటిపైనా చర్చించనున్నారు. అక్టోబర్ 15 నుంచి ప్రారంభం కానున్న వైఎస్సార్ రైతు భరోసా పథకానికి సంబంధించి మంత్రులు కీలకంగా చర్చించనున్నారు.

AP cabinet meet.. key issues discussion

ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ప్రభుత్వం తీసుకున్న రివర్స్ టెండరింగ్ విధానం, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలను సమీక్షించాలని భావించిన ప్రభుత్వం పీపీఏ రద్దు చేయాలని కూడా నిర్ణయించింది. అయితే ట్రిబ్యునల్ రెండు రోజుల క్రితం రద్దు చెయవద్దని ఆదేశించింది. ఈ అంశం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కూడా ప్రధానంగా చర్చ జరగనుంది. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన 15వ పీఆర్సీపై కూడా చర్చించనున్నారు. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ఎన్నికల్లో హామీ ఇచ్చిన నవరత్నాల అమలు కోసం కూడా ఈ భేటీలో చర్చ జరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+