AP Cabinet: 16న ఏపీ కేబినెట్ భేటీ ! ఓటాన్ బడ్జెట్ సహా కీలక నిర్ణయాల కోసం..?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండోసారి కేబినెట్ భేటీ కాబోతోంది. ఇప్పటికే కీలక హామీలతో పాటు శ్వేతపత్రాలపై దృష్టిపెట్టిన ప్రభుత్వం.. త్వరలో మరిన్ని కీలక నిర్ణయాల దిశగా అడుగులేస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 16న కేబినెట్ భేటీ ఏర్పాటు చేస్తోంది. ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడ్డ అసెంబ్లీ బడ్జెట్ భేటీ నిర్పహించాలా లేక ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేయాలా అన్న దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
ఈ నెల 16న వెలగపూడిలోని సచివాలయంలో సమావేశం కానున్న ఏపీ కేబినెట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో పాటు పలు అంశాలపై చర్చించబోతోంది. ఇందులో సంక్షేమ పథకాల అమలు కూడా ఉంది. ఇప్పటికే ఎన్డీయే ఎన్నికల హామీల్లో భాగమైన పెన్షన్ల పెంపుతో పాటు మరో నాలుగు అంశాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. మిగిలిన వాటిపై ఈసారి కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఇందులో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించడంతో పాటు మరికొన్ని అంశాలున్నాయి. వీటికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశముంది. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వం ఇంకా కుదురుకోకపోవడంతో మరో రెండు, మూడు నెలల కోసం ఓటాన్ అకౌంట్ బడ్డెట్ ద్వారా నిధుల విడుదలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. దీనిపై ఆర్డినెన్స్ విడుదలకు వీలుగా కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !!












Click it and Unblock the Notifications