Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ కేబినెట్ భేటీ.. వాటికి గ్రీన్ సిగ్నల్ !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు మంత్రి మండలి సమావేశం కానుంది. ఈ రోజు (బుధవారం) ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ భేటీలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అనేక కీలక అంశాలపై మంత్రులు, అధికారులతో సీఎం చర్చించనున్నారు.

అమరావతి అభివృద్ధిపై ప్రధాన దృష్టి..

అమరావతి రాజధాని అభివృద్ధికి సంబంధించి జీఏడీ టవర్ టెండర్లకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.

HOD-4 టవర్లు నిర్మాణానికి టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.

రెండో దశలో 44,000 ఎకరాల భూ సేకరణ పై చర్చ జరగనుంది.

5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం,

2,500 ఎకరాల్లో ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్,

2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రియల్ హబ్ నిర్మాణ ప్రతిపాదనలకు ఆమోదం పొందే అవకాశముంది.

ap-cabinet-meeting-today-under-the-chairmanship-of-cm-chandrababu-naidu

ఇతర కీలక అంశాలు..

వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ సంస్థలకు భూ కేటాయింపులపై కేబినెట్ లో చర్చించనున్నారు.

'తల్లికి వందనం' పథకంపై వివరాలు సమీక్షించనున్నారు.

కూటమి ప్రభుత్వం ఒక సంవత్సరం పాలనపై సమీక్ష జరగనుంది.

జూన్ 21న విశాఖపట్నంలో జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవంపై సిద్ధతలపై మంత్రులతో చర్చించనున్నారు.

జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి సంబంధించి సమీక్ష జరగనుంది.

ఈ సమావేశం ద్వారా రాష్ట్రానికి సంబంధించిన కొన్ని ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగతిన పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+