AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు-బడ్డెట్ కు ఆమోదముద్ర..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాళ ప్రవేశపెడుతున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సహా పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపేందుకు ఉదయం కేబినెట్ భేటీ నిర్వహించారు. అమరావతి సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. అనంతరం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వీటిలో ఇవాళ ప్రవేశపెట్టే బడ్జెట్ కు ఆమోదం తెలపడంతో పాటు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్నీ ఆమోదించారు.
ఇవాళ్టి కేబినెట్ భేటీలో ముందుగా 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదించారు.అలాగే నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్ పుడ్ ప్రాసెసింగ్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు.

డాక్టర్ వైఎస్‌ఆర్ హార్టికల్చర్ యూనివర్శిటీ పరిధిలో హార్టికల్చరల్ పాలిటెక్నికల్ కళాశాల పనిచేయనుంది. అటు నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటుకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ పరిధిలో ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల పనిచేయనుంది.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రేవేట్ యూనివర్శిటీస్ (ఎస్టాబ్లిస్‌మెంట్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్ కేటగిరిలో మూడు ప్రేవేట్ యూనివర్శిటీలకు అనుమతి ఇస్తూ కేబినెట్ మరో నిర్ణయం తీసుకుంది.
సచివాలయంలో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ అధ్యక్షతన సమావేశమైన మంత్రిమండలి. #APAssembly#Budget#CMYSJagan#AndhraPradesh pic.twitter.com/JbofWBwBlV
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) February 7, 2024
అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. చివరిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగానికి ఆమోదం తెలిపారు.
-
ఎల్పీజీ స్ధానంలో PNG కనెక్షన్ తీసుకుంటే - ఏపీ సర్కార్ భారీ సబ్సిడీ ఆఫర్ ..! -
ఏపీలో పర్యాటకానికి మహర్దశ.. కీలక ఆదేశాలిచ్చిన సీఎం చంద్రబాబు -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications