AP New Districts: ఏపీలో 3 కొత్త జిల్లాలు ఇవే-మార్పులకు కేబినెట్ లైన్ క్లియర్..!

ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జిల్లాల పునర్ విభజనలో భాగంగా ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ అమరావతిలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో మూడు కొత్త జిల్లాల ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది. ఇందులో గతంలో ఆమోదించిన రెండు జిల్లాలతో పాటు కొత్తగా మరో జిల్లా కూడా ఉంది. దీంతో ఈ జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం అవుతోంది. ఈ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారు. దీనిపై అప్పట్లో విపక్ష కూటమి పార్టీలు అభ్యంతరాలు తెలిపాయి. తాము అధికారంలోకి రాగానే మరోసారి జిల్లాల పునర్ విభజన చేస్తామని ప్రకటించాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది జిల్లాల పునర్ విభజన కసరత్తు ప్రారంభమైంది. ఇందుకోసం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్రంలో పర్యటించి ప్రజాభిప్రాయం సేకరించింది. అనంతరం కొత్తగా రెండు జిల్లాల ఏర్పాటుకు సిద్ధమయ్యారు. అవే మార్కాపురం, మదనపల్లె. ఆ తర్వాత పరిణామాలు మారాయి.

ap cabinet nod to three new districts with key changes

గతంలో ఏర్పాటు చేసిన 25 జిల్లాలకు తోడు మార్కాపురం, మదనపల్లె జిల్లాలు మాత్రమే ఏర్పాటు చేయాలని భావించిన ప్రభుత్వం అనంతరం రంపచోడవరం కేంద్రంగా మన్యంలో మరో జిల్లా ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో మొత్తం మూడు జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఇవాళ మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం జిల్లాల ఏర్పాటుకు కేబినెట్ అంగీకరించింది. అయితే వీటితో పాటు పలు జిల్లాల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో ఉన్న రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లె జిల్లాకు మారుస్తున్నారు. అలాగే రాజంపేటను కడపలో కలుపుతున్నారు. వీటితో పాటు రైల్వేకోడూరును తిరుపతి జిల్లాలో కలపాలని కేబినెట్ నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+