Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

29న ఏపీ క్యాబినెట్ సమావేశం -పోలవరం పై నిర్ణయం: మూడు రాజధానులపై..!!

ఏపీలో వేగంగా మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ నెల 29న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని శాఖలకు జీఏడి సమాచారం అందించింది. అయితే, వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతన్న ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గాలకు..సచివాలయాల కు నిధుల మంజూరు పైన అధికారికంగా ఆమోద ముద్ర వేయనున్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో భేటీ సమయంలో పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం... పునరావాస ప్యాకేజీ పైన మరోసారి అభ్యర్ధించారు. ఇప్పటికీ కేంద్రం నుంచి అనుమతి రాకుంటే రాష్ట్ర ప్రభుత్వం పోలవరం నిర్మాణం.. పునారావాస అంశాల పైన ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని పైన ఈ కేబినెట్ లో కీలక నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం. అదే విధంగా.. మూడు రాజదానుల విషయంలోనూ వైసీపీలో అంతర్గతంగా చర్చ సాగుతోంది.

AP Cabinet to meet 29th of this month, may approve many key deisions

ఈ అంశాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టటమా ..లేక, ఇప్పటికే ప్రకటించటంతో హైకోర్టు తీర్పు పైన న్యాయ పరంగా ముందడుగు వేయాలా అనే ఆలోచన చేస్తోంది. దీంతో..ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ.. హైకోర్టు తీర్పు తీర్పు తరువాత ప్రభుత్వం ఈ విషయం పైన ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో..ఇక ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ పోలవరం..రాజధాని రెండు అంశాలు సీఎం జగన్ కు ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. దీంతో..కేంద్రంతోనూ చర్చలు కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ వీటి పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇక, సెప్టెంబర్‌లో నిర్వహించే అసెంబ్లీ సమావేశాల పైనా నిర్ణయం తీసుకోనున్నారు.

సెప్టెంబర్ రెండో వారంలో అసెంబ్లీ వర్షాకాల సమావేవాలు నిర్వహణకు సూత్రప్రాయంగా నిర్ణయించారు. గడప గడపకు వైసీపీ ప్రభుత్వం నిర్వహణ కారణంగా గత నెలలోనే అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నా.. నిర్ణయం తీసుకోలేదు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షం నుంచి ప్రభుత్వం పైన వస్తున్న అన్ని విమర్శలకు అసెంబ్లీ వేదికగా సమాధానం ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దం అవుతోంది. దీంతో..ఈ కేబినెట్ లో కీలక నిర్ణయాలు తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+