ఏపీ సీఎస్ పదవీకాలం పొడిగింపు..! కేంద్రం ఉత్తర్వులు జారీ..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary ) జి సాయిప్రసాద్ (G Sai Prasad) కు కేంద్రం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. సాయి ప్రసాద్ పదవీకాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాలశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ అభ్యర్ధన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుండటం, ఇతరత్రా కారణాలతో రాష్ట్రం చేసిన అభ్యర్ధనను కేంద్రం అంగీకరించింది.

మున్సిపల్ ఎన్నికల బ్రేక్ వెనుక ఏం జరిగింది ? ఎస్ఈసీ ప్రకటనకు ముందు, వెనుక..!
మున్సిపల్ ఎన్నికల బ్రేక్ వెనుక ఏం జరిగింది ? ఎస్ఈసీ ప్రకటనకు ముందు, వెనుక..!

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపీ కృష్ణ సాయి ప్రసాద్‌కు మరో ఆరు నెలల పాటు సర్వీసు పొడిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 1991 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జి.సాయి ప్రసాద్ సర్వీసును 2026 డిసెంబర్ 1 నుంచి 2027 మే 31 వరకు మరో ఆరు నెలల పాటు పొడిగించేందుకు కేంద్రం అంగీకరించింది. దీంతో ఆయన 2027 మే 31 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగనున్నారు. ఏపీ ప్రభుత్వం సెప్టెంబర్ 29న పంపిన ప్రతిపాదనకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

AP Chief Secretary G Sai Prasad Gets Six-Month Service Extension Centre Approves Proposal
వైసీపీ నేతలకు ఎస్ఈసీ ఝలక్- సుప్రీం తీర్పు, ఎన్నికల బ్రేక్ తర్వాత మరో ట్విస్ట్..!
వైసీపీ నేతలకు ఎస్ఈసీ ఝలక్- సుప్రీం తీర్పు, ఎన్నికల బ్రేక్ తర్వాత మరో ట్విస్ట్..!

ఆల్ ఇండియా సర్వీసెస్ (డెత్ కమ్ రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనలు, 1958లోని రూల్ 16(1)కు సడలింపు కల్పిస్తూ, ఆల్ ఇండియా సర్వీసెస్ (కేడర్ రూల్స్ సవరణ) నిబంధనలు, 1960లోని రూల్ 3ను వినియోగించి సీఎస్ పదవీకాలం పొడిగింపునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రటరీ రాజేష్ కుమార్ యాదవ్ ఈ ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ ఉత్తర్వుల ప్రతులను ప్రధానమంత్రి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం, సంబంధిత అధికారులకు పంపించారు. దీంతో సీఎస్ ను స్ధానిక ఎన్నికల తర్వాత కూడా కొనసాగించేందుకు చంద్రబాబు సర్కార్ కు వెసులుబాటు లభించినట్లయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+