వైఎస్ జగన్‌తో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి భేటీ: ఆ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడంతో హర్షం

అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ.. మరో ఆరు నెలల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. ఆయన పదవిని పొడిగించాలని కోరుతూ ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఆయన పదవీ కాలాన్ని పొడిగిస్తూ ఆదివారం సాయంత్రమే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అండర్ సెక్రెటరీ కుల్‌దీప్ చౌదరి దీనికి సంబంధించిన ఆదేశాలను ఇచ్చారు.

నిజానికి- సమీర్ శర్మ పదవీ కాలం మంగళవారం నాటితో ముగియాల్సి ఉంది. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఆయన సేవలను మరి కొంతకాలం వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించారు. సమీర్ శర్మ పదవిని పొడిగించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇదివరకే లేఖ సైతం రాశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకుంది. సమీర్ శర్మ పదవీ కాలాన్ని ఆరు నెలలకు పొడిగించింది.

AP chief secretary sameer sharma meets cm ys jagan after centre extended his tenure for six months

దీనితో వచ్చే సంవత్సరం మే 31వ తేదీ వరకు సమీర్ శర్మ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతారు. ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించకపోతే ప్రత్యామ్నాయం ఏమిటనే విషయాన్ని కూడా వైఎస్ జగన్ సిద్ధం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్‌గా పనిచేస్తోన్న నీరభ్ కుమార్ ప్రసాద్ లేదా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా అపాయింట్ చేస్తారంటూ ప్రచారం సాగింది.

అవేవీ కార్యరూపం దాల్చలేదు. వైఎస్ జగన్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించి- సమీర్ శర్మ పదవీకాలాన్ని పొడిగించింది. దీనితో ఈ మధ్యాహ్నం ఆయన వైఎస్ జగన్‌ను మర్యాదపూరకంగా కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్- శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విధి నిర్వహణను కొనసాగించాలని సూచించారు. అనంతరం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు వచ్చిన కేంద్ర బృందంతో సమావేశం అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+