మాజీ ఇంటెలిజెన్స్ ఛీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు అరెస్ట్-జత్వానీ వేధింపుల కేసులో..!
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన నటి కాదంబరీ జెత్వానీపై వేధింపులకు పాల్పడిన వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ ఛీప్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులు అరెస్టు అయ్యారు. ఏపీ సీఐడీ అధికారులు ఇవాళ ఉదయం హైదరాబాద్ లో పీఎస్సార్ ఆంజనేయుల్ని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయన్ను విజయవాడకు తీసుకొచ్చి ప్రాధమిక విచారణ తర్వాత కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.

వైసీపీ సర్కార్ అధికారంలోకి రాగానే సీనియర్ ఐపీఎస్ అధికారి అయిన పీఎస్సార్ ఆంజనేయులుకు ఇంటెలిజెన్స్ ఛీఫ్ పదవి దక్కింది. ఆ తర్వాత ఏపీపీఎస్సీ సెక్రటరీగా కూడా అదనపు బాధ్యతల్లో పనిచేశారు. ఆ సమయంలో ముంబైకి చెందిన ఓ పారిశ్రామికవేత్త కోసం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో నటి కాదంబరీ జెత్వానీపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని ముగ్గురు ఐపీఎస్ లపై ఆరోపణలు ఉన్నాయి. వీరిలో పీఎస్సార్ ఆంజనేయులు పాత్ర కీలకంగా మారింది.
పీఎస్సార్ ఆంజనేయులు మరో ఇద్దరు ఐపీఎస్ లు విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా సాయంతో కాదంబరీ జెత్వానీపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే కుట్రకు తెరలేపారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నటి జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరుపుతున్న సీఐడీ అధికారులు ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ ల సస్పెన్షన్ కు సిఫార్సు చేయడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసంది. అయితే ఈ కుట్రలో కీలకమైన పీఎస్సార్ ఆంజనేయుల్ని అరెస్టు చేయకుండా వదిలేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో సీఐడీ పీఎస్సార్ ను హైదరాబాద్ లో అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications