మార్గదర్శి ఛైర్మన్ రామోజీ రావుపై కేసు నమోదు చేసిన ఏపీ సీఐడీ..!!

మార్గదర్శి ఛిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా విస్తృత సోదాల అనంతరం కేసు పెట్టారు.

అమరావతి: మార్గదర్శి చిట్ ఫండ్స్ ఛైర్మన్ రామోజీ రావుపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇవ్వాళ రాష్ట్రవ్యాప్తంగా ఆ సంస్థ కార్యాలయాలపై విస్తృత దాడులను నిర్వహించిన అనంతరం ఈ మేరకు కేసు పెట్టారు. ఛిట్ ఫండ్ కార్యకలాపాల కోసం రూపొందించిన మార్గదర్శకాలను ఆ సంస్థ యాజమాన్యం ఉల్లంఘించినట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు చెబుతున్నారు. ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, ఇతర బ్రాంచ్ మేనేజర్ల పేర్లను ఇందులో పొందుపరిచినట్లు తెలుస్తోంది.

మార్గదర్శి ఛిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ల నివాసాలపై ఇవ్వాళ ఏపీ సీఐడీ అధికారులు సోదాలను నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఈ తనిఖీలు సాయంత్రం వరకూ కొనసాగాయి. ఈ ఉదయం ఆరంభమైన తనిఖీల సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మార్గదర్శి ఛిట్ ఫండ్ పై తొలిసారిగా 2006లో అప్పటి లోక్ సభ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కేసు వేసిన విషయం తెలిసిందే. ఈ కేసును హైకోర్టు 2014లో కొట్టి వేసింది. దీన్ని సవాలు చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ 2020లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్ అయింది.

AP CID officials reportedly case filed against Margadarsi chits Chairman Ramoji Rao

ఈ పరిణామాల మధ్య- ఇవ్వాళ ఏపీ సీఐడీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ ఫండ్ కార్యాలయాలపై దాడులు చేయడం, తనిఖీలు చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అదే సమయంలో- విజయవాడ మార్గదర్శి మెయిన్ బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయనను సాయంత్రం వరకు ప్రశ్నించారు. డిపాజిటర్ల నుంచి సేకరించిన నిధులను మళ్లించారనేది మార్గదర్శి చిట్స్ పై ఉన్న ప్రధాన ఆరోపణ.

ఇదివరకు ఏపీ సీఐడీ, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీలను నిర్వహించారు. అప్పట్లో కేసులేవీ నమోదు కాలేదు. ఈ దఫా- ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్, కొందరు బ్రాంచ్ మేనేజర్లపై కేసు నమోదు చేయడం- చర్చనీయాంశమౌతోంది. ఐపీసీ సెక్షన్ 120 (బీ), 409, 420, 477 (ఏ) , రెడ్ విత్ 34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం. ప్రధానంగా విశాఖపట్నం, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఏపీ సీఐడీ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+