మహాసముద్రంలో INS త్రిశూలం వ్యూహం.. అమ్ములపొదిలో సరికొత్త అస్త్రాలు!

భారత రక్షణ రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం లిఖితమైంది. సముద్ర గర్భంలో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేందుకు, భారత జలాలపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఒకేసారి మూడు అత్యాధునిక స్వదేశీ యుద్ధనౌకలు భారత నౌకాదళం (ఇండియన్ నేవీ) లోకి ప్రవేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు అత్యంత ప్రతిష్టాత్మకమైన మూడు యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు.

ఇందులో అడ్వాన్స్‌డ్ స్టెల్త్ ఫ్రిగేట్ 'ఐఎన్‌ఎస్ దూనగిరి’ (INS Dunagiri), లార్జ్ సర్వే వెసల్ 'ఐఎన్‌ఎస్ సంశోధక్’ (INS Sanshodhak), యాంటీ సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ 'ఐఎన్‌ఎస్ అగ్రయ్’ (INS Agray) ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ ఫ్రంట్‌లైన్ నౌకల చేరికతో భారత నావికాదళ పోరాట పటిమ, సముద్ర రక్షణ సామర్థ్యం అసాధారణంగా పెరగనుంది.

PM Modi Commissions Three Indigenous Warships Into Indian Navy To Significantly Boost Maritime Defense Capabilities

కోల్‌కతా జీఆర్‌ఎస్‌ఈ అద్భుత సృష్టి.. శత్రువులకు సింహస్వప్నం!

ఇండియన్ నేవీకి చెందిన 'వార్‌షిప్ డిజైన్ బ్యూరో’ రూపకల్పన చేయగా.. కోల్‌కతాకు చెందిన ప్రముఖ రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ 'గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్’ (GRSE) ఈ మూడు నౌకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. నౌకాదళ బ్యాలెన్స్‌డ్ అప్రోచ్‌కు అద్దం పట్టేలా నిర్మితమైన ఈ మూడు నౌకలు సముద్ర పోరాటాలు, హైడ్రోగ్రాఫిక్ సర్వేలు, , జలాంతర్గామి నిరోధక చర్యల్లో కీలక పాత్ర పోషించనున్నాయి.

ఐఎన్‌ఎస్ దూనగిరి (INS Dunagiri):

ఇది 'ప్రాజెక్ట్ 17A’ కింద తయారైన ఐదో స్టెల్త్ ఫ్రిగేట్. శత్రువుల రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లే ఈ నౌకలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ (BrahMos) ఉపరితలం-నుంచి-ఉపరితలానికి ప్రయోగించే క్షిపణులు, అలాగే మీడియం రేంజ్ ఉపరితలం-నుండి-గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థలను అమర్చారు. ఇది నేవీ ఫైటింగ్ కెపాసిటీని ఊహించని స్థాయికి తీసుకెళ్తుంది.

INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం..

ఐఎన్‌ఎస్ సంశోధక్ (INS Sanshodhak):

నాల్గవ లార్జ్ సర్వే వెసల్ అయిన ఈ నౌక తీరప్రాంతం , లోతైన సముద్ర జలాల్లో హైడ్రోగ్రాఫిక్ సర్వేలు నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. రక్షణ, పౌర అవసరాల కోసం సముద్రగర్భ సమాచారాన్ని సేకరించేందుకు ఇందులో అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్ (AUV), రిమోట్లీ ఆపరేటెడ్ వెహికల్స్ (ROV) వంటి అధునాతన సిస్టమ్స్ ఉన్నాయి.

ఐఎన్‌ఎస్ అగ్రయ్ (INS Agray):

'అర్ణాల’ క్లాస్‌కు చెందిన ఈ నాల్గవ యాంటీ-సబ్‌మెరైన్ షాలో వాటర్ క్రాఫ్ట్ తక్కువ లోతు ఉండే తీర ప్రాంత జలాల్లో శత్రు జలాంతర్గాములను వేటాడటంలో దిట్ట. ఇందులో తేలికపాటి టార్పెడోలు, స్వదేశీ రాకెట్ లాంచర్లు, షాలో-వాటర్ సోనార్ వ్యవస్థలు ఉన్నాయి.

INS Sagardhwani: 30 ఏళ్ల సముద్ర వేటగాడు. అసలు మిషన్ ఇదే!
INS Sagardhwani: 30 ఏళ్ల సముద్ర వేటగాడు. అసలు మిషన్ ఇదే!

75 శాతం స్వదేశీ పరిజ్ఞానం.. 200 పైగా ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం

ఈ మూడు యుద్ధనౌకల కమిషనింగ్ ద్వారా భారతదేశపు 'ఆత్మనిర్భర్ భారత్’ (స్వయంసమృద్ధి) సంకల్పం మరోసారి ప్రపంచానికి చాటిచెప్పినట్లయింది. ఈ నౌకల నిర్మాణంలో వాడిన పరికరాలు, సాంకేతికతలో 75 శాతానికి పైగా పూర్తిగా స్వదేశీ కంటెంట్ కావడం విశేషం. మన దేశీయ రక్షణ పర్యావరణ వ్యవస్థ ఎదుగుదలకు ఇది నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

ఈ భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో భారతీయ పరిశ్రమలతో పాటు ముఖ్యంగా 200కు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) చురుగ్గా పాల్గొన్నాయి. తద్వారా దేశంలో వేలాది మందికి ప్రత్యక్షంగా , పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించాయి. భారత ప్రభుత్వం, ఇండియన్ నేవీ, పబ్లిక్ సెక్టార్ షిప్‌యార్డులు , ప్రైవేట్ పరిశ్రమల సమష్టి కృషికి ఈ మూడు సరికొత్త నౌకల కమిషనింగ్ ఒక అద్భుతమైన మైలురాయి అని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+