నన్నే గెలుకుతారా, 29 బంతుల్లో ఊచకోత - వైభవ్ రివేంజ్..!!
వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. శ్రీలంక బౌలర్లపై ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అదే ఊపుతో బ్యాటింగ్ చేస్తూ సెంచరీకి చేరువయ్యాడు. కానీ ఆరు పరుగుల తేడాతో రికార్డు సెంచరీ మిస్ చేసుకున్నాడు. గా 29 బంతుల్లో 94 పరుగులు చేసి ఔటయ్యాడు. తనను రెచ్చగొట్టినందుకు శ్రీలంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా బాదేసి ప్రతీకారం తీర్చుకున్నాడు.
ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా దంబుల్లా వేదికగా ఫైనల్ పోరులో శ్రీలంక-ఎ, భారత్-ఎ జట్లు తలపడుతున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ.. రివేంజ్ మోడ్‌లో ఇన్నింగ్స్ ఆడాడు.ఈ ట్రై సిరీస్‌లో వైభవ్ లీగ్ స్టేజ్ మ్యాచుల్లో విఫలమవుతూ వచ్చాడు. ఆఖరి లీగ్‌లో లంకపై సూపర్ ఓవర్లో భారత్-ఎ ఓటమి చవి చూసింది. ఆ మ్యాచ్ ముగిసిన తర్వాతే శ్రీలంక ప్లేయర్లు, వైభవ్ సూర్యవంశీ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తనను రెచ్చగొట్టినందుకు శ్రీలంక బౌలర్లను నిర్దాక్షిణ్యంగా బాదేసి ప్రతీకారం తీర్చుకున్నాడు. వేసిన ప్రతి బంతీ బ్యాట్‌ను తాకి బౌండరీ వైపు దూసుకెళ్లింది. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన వైభవ్.. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డు సాధించాడు.

మరోసారి సెంచరీ మిస్
వైభవ్ ఆడిన 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్స్‌లు, 324 స్ట్రైక్ రేట్‌తో 94 పరుగులు చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయినప్పటికీ చేయాల్సిన విధ్వంసం చేసి పెవిలియన్ చేరాడు. కాగా, ఏబీ డీవలియర్స్ రికార్డును వైభవ్ ఈ విధ్వంసపు బ్యాటింగ్ తో అధిగమించాడు. అయితే, సెంచరీ చేయటం మాత్రం వైభవ్ అటు ఐపీఎల్ లో .. ఇటు ఈ మ్యాచ్ లోనూ వరుసగా విఫలం అవుతున్నారు. తాను వ్యక్తిగత రికార్డుల కోసం ఆడటం లేదని వైభవ్ ఇప్పటికే స్పష్టం చేసారు. శ్రీలంక స్పిన్నర్లతో ఒక ఆట ఆడుతున్న వైభవ్ ఇన్నింగ్స్ పైన ఇప్పుడు క్రికెట్ దిగ్గజాల నుంచి పెద్ద ఎత్తున ప్రశంసలు అందుతున్నాయి.












Click it and Unblock the Notifications