'మా ఇంటి బంగారం' బాక్సాఫీస్ సునామీ.. ఒకప్పుడు విజయశాంతి.. ఇప్పుడు సమంత..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో నటించిన 'మా ఇంటి బంగారం' మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 4న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. విడుదలైన తొలిరోజే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 13.15 కోట్ల గ్రాస్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అలాగే రెండో రోజు కూడా సమంత సినిమాకు డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని తెలుస్తుంది.

ఇక ఇవాళ ఆదివారం కావడంతో రెండు రోజుల కంటే కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రాలాలా పిక్చర్స్ బ్యానర్ పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా నిర్మించిన సినిమాకు సినీ దర్శకురాలు బి. వి. నందినిరెడ్డి డైరెక్షన్​ వహించారు. వీరిద్దరి కాంబోలో గతంలో ఓ బేబీ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఆ మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఇప్పుడు మరోసారి ఈ క్రేజీ కాంబో రిపీట్ అయింది.

ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్​ టైనర్ గా రూపొందిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే దూసుకెళ్తోంది. ముఖ్యంగా సినిమా ఓపెనింగ్స్‌ కు మహిళా ప్రేక్షకులు భారీగా తరలిరావడంతో లాంగ్ రన్ లో ఈ మూవీ మరిన్ని రికార్డ్స్ ను నమోదు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇండియాలోనే కాదు అటు నార్త్ అమెరికాలోనూ సమంత మూవీకి విశేష స్పందన లభిస్తోంది. ఈ మూవీ అక్కడ దాదాపు 270 కు పైగా సెంటర్స్ లో రిలీజ్ అయింది. ఫస్ట్ డే ఏకంగా 533,401 డాలర్లు అంటే రూ. 5.03 కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. అటు కెనడాలోనూ రూ. 25 లక్షల వరకు రాబట్టింది. ఈ జోరు చూస్తుంటే వీకెండ్ నాటికి టార్గెట్ రీచ్ అయ్యేలా ఉంది.

Samantha Delivers Blockbuster Start Maa Inti Bangaram Gets Vijayashanti Like Praise Online Samantha

ఇక 'మా ఇంటి బంగారం' భారీ విజయం పట్ల సమంత సంతోషం వ్యక్తం చేశారు. యువత, మహిళలు, పెద్దలు.. అందరూ సినిమాను ఆశీర్వదించడానికి రావడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నారు. మరోవైపు ఫ్యాన్స్ సమంతను అలనాటి లేడీ స్టార్ విజయశాంతితో పోలుస్తున్నారు. అప్పట్లో విజయశాంతి.. ఇప్పుడు సమంత అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ సినిమాలో సమంతను చూస్తుంటే కర్తవ్యంలో విజయశాంతి గుర్తుకువస్తోందని మరికొందరు లేడీ ఫ్యాన్స్ చెబుతున్నారు. సమంత లేడీ పవర్ స్టార్ అంటూ ప్రశంసిస్తున్నారు. అప్పట్లో విజయశాంతి సినిమాలను ప్రేక్షకులు ఎగబడి చూసేవారు. స్టార్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఆమె సినిమాలకు ఉండేది. ఇప్పుడు సమంతను విజయశాంతితో పోలుస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+