నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడుతో సీఎం చంద్రబాబు భేటీ..
ఏపీ సీఎం చంద్రబాబు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బేరీతో సమావేశం అయ్యారు. సచివాలయం వేదికగా వీరి భేటీ జరగగా.. మీటింగ్ లో రాష్ట్రాభివృద్ధికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, వనరులు, సవాళ్లను సీఎం వివరించారు. వన్ ఫ్యామిలీ, వన్ ఏఐ ప్రొఫెషనల్, వన్ ఎంటర్ ప్రెన్యూర్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర-2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నిర్దిష్ట లక్ష్యాలతో పనిచేస్తున్నామని అందుకు కేంద్రంతోపాటు నీతి ఆయోగ్ సాకారం కూడా కావాలని కోరారు. వికసిత్ భారత్ 2047 సాధనలో ఏపీ మోడల్ స్టేట్‌గా నిలుస్తుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
అంతే కాకుండా హైదరాబాద్ లో తాను అభివృద్ధి చేసిన జినోమ్ వ్యాలీలో ఇప్పుడు 700 కంపెనీలు ఉన్నాయని.. అదే తరహాలో ఏపీలోనూ అత్యుత్తమ విధానాలను అమలు చేయనున్నామని వివరించారు. అలానే ఈ సమావేశంలో బ్లూ ఎకానమీ, గ్రీన్ హైడ్రోజన్, కృత్రిమ మేధ అభివృద్ధిని గ్రోత్ ఇంజిన్లుగా గుర్తించామని సీఎం వివరించారు. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, వనరుల సమీకరణ సహా పలు విషయాల్లోనూ నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషించాలని కోరారు.

అందుకోసం ప్రతి మూడు నెలలకు ఒకసారి సమీక్ష జరపాలని అన్నారు. స్మార్ట్ సిటీలు, మౌలిక వసతుల బలోపేతంలో ఏపీ ప్రభుత్వం.. నీతి ఆయోగ్ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. సీఎం ప్రతిపాదనలపై సుమన్ బేరీ సానుకూలంగా స్పందించారు. రాష్ట్రానికిది అనుకూల సమయం అని.. అభివృద్ధికి ఆస్కారముందని చెప్పారు. ఏపీ అభివృద్ధి కోసం నీతి ఆయోగ్ భాగస్వామ్యం కచ్చితంగా ఉంటుందని తెలిపారు.
ఇక 30 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో చంద్రబాబును కలిసినప్పటి సంగతులను సుమన్ బేరీ గుర్తుచేసుకున్నారు. దేశంలో చాలా మంది సీఎంలున్నా సంస్కరణలను అనుకూలంగా మార్చుకుని ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబు అని ప్రశంసించారు. ఐటీకి ప్రోత్సాహం, విమానాశ్రయాలు, ప్రైవేటు విద్యుత్తు ప్లాంట్లు సహా పలు ఆవిష్కరణలకు నాంది పలికారన్నారు. భవిష్యత్తు అవసరాలను గుర్తించి ఆలోచనలు, పాలసీలు అమలుచేసే నాయకులతో ప్రజల జీవితాలు మారుతాయన్నారు. వాజపేయీ హయాంలో అమలుచేసిన సంస్కరణలను అందిపుచ్చుకొని అనేక పాలసీలు తీసుకొచ్చిన చంద్రబాబు ప్రజల జీవితాలు మార్చారని కొనియాడారు. ఉమ్మడి ఏపీకి సీఎంగా చంద్రబాబు అమలుచేసిన ప్రతి పాలసీని, సంస్కరణలనూ.. ఆ తర్వాత కాలంలో దేశమంతా పాటించిందని సుమన్ బేరీ అన్నారు.
మరోవైపు మంగళగిరి ఎయిమ్స్‌లో అందుతున్న వైద్యసేవలను నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ సుమన్ బేరీ నేతృత్వంలోని బృందం పరిశీలించింది. ముందుగా ఆయన ఆసుపత్రి ఉన్నతాధికారులు, వైద్యులతో సమావేశమయ్యారు. ఆ తర్వాత పలు విభాగాలను పరిశీలించారు. రోగులకు అందిస్తున్న ప్రత్యేక వైద్యసేవలు, సౌకర్యాలు, మౌలిక వసతుల వివరాలను.. ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ని అడిగి తెలుసుకున్నారు. వైద్య, నర్సింగ్ విద్యార్థులకు బోధన గురించి.. వసతి గృహాల గురించి ఆరా తీశారు.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications