మాస్టారుగా మారిన సీఎం చంద్రబాబు.. వీడియో వైరల్ !
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్త అవతారం లోకి మారారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రభుత్వ, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ చేపడుతోంది. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని కొత్తచెరువు జెడ్పీ పాఠశాలలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్వయంగా ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులకు 'వనరులు' అనే పాఠాన్ని బోధించారు. సీఎంతో పాటు మంత్రి నారా లోకేష్ సహా పలువురు అధికారులు, తల్లిదండ్రులు, విద్యార్థులు హాజరయ్యారు.
అంతకు ముందు పాఠశాల ప్రాంగణంలో విద్యార్థులు, తల్లిదండ్రులతో ముచ్చటించారు చంద్రబాబు. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి.. హాజరు, మార్కుల వివరాలు తెలుసుకొని తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా మాట్లాడారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులు వారిపై మరింత శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. పాఠశాల అభివృద్ధిపై వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు.

మరోవైపు విద్యార్థులు తయారు చేసిన 'తల్లికి వందనం' పోస్టర్లు, చిత్రకళలు, కళారూపాలను చూసి మెచ్చుకున్నారు. అనంతరం మంత్రి లోకేష్ తో కలిసి పాఠశాల క్యాంపస్‌ను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు స్వయంగా క్లాస్ తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో నేర్చుకుంటున్న విషయాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తమ తల్లుల పేరిట మొక్కలు నాటారు. పాఠశాల ఆవరణను మరింత సుందరంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 61 వేల పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో 2.28 కోట్ల మంది పాల్గొనడం విశేషం. ఒకే రోజున రెండు కోట్ల మంది తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు సమావేశమయ్యే కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా ప్రభుత్వం అరుదైన రికార్డు నెలకొల్పింది.
కొత్తచెరువు జడ్పీ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్ల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్. విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులు పరిశీలించిన ముఖ్యమంత్రి. విద్యార్థులు, తల్లిదండ్రులకు సూచనలిచ్చిన సీఎం చంద్రబాబు గారు. #MegaParentTeacherMeeting#IdhiManchiPrabhutvam… pic.twitter.com/ea5svsHpuU
— Telugu Desam Party (@JaiTDP) July 10, 2025
ఇక చివరిగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పాఠశాలల్లో వాస్తవమైన మార్పులు వస్తున్నాయని, మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో విద్యాశాఖ మంచి పనులు చేస్తోందని కితాబిచ్చారు. పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులపై తీసుకుంటున్న చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సీఎం చంద్రబాబు ఫొటోలు దిగారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications