మంచి ఫలితాలు, 6న పట్టిసీమ ద్వారా నీటి విడుదల: చంద్రబాబు
అమరావతి: నీటి సంరక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. శనివారం ఆయన విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఏపీని కరువు రహిత రాష్ట్రంగా చేసేందుకు కృషి చేస్తున్నామన్నారు.
Throughout AP, ground water level has increased by 0.99 metres & nearly a lakh acres of farm land have been brought under ayacut. (4/4)
— N Chandrababu Naidu (@ncbn) July 2, 2016
ఈనెల 6 నుంచి పట్టిసీమ ద్వారా నీరు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. నదులను అనుసంధానం చేసిన ఘనత టీడీపీదేనని అన్నారు. త్వరలో కృష్ణా-పెన్నా నదులను అనుసంధానిస్తామని ఆయన తెలిపారు. ప్రతీ గ్రామంలో వంద పంటకుంటలు తవ్వాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
In May 2015, ground water levels in Rayalseema stood at 21.95 metres and in May 2016, the ground water levels rose to 16.24 metres. (3/4)
— N Chandrababu Naidu (@ncbn) July 2, 2016
గోదావరి నీరు వృథాగా సముద్రంలోకి వెళుతోందని, నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. 2 కోట్ల ఎకరాల్లో 50 లక్షల ఎకరాలకు బిందు సేద్యం ద్వారా నీరు అందించాలని నిర్ణయించామని, రోజుకు లక్ష ఎకరాలకు రెయిన్‌గన్ ద్వారా నీరందిస్తామని చెప్పారు.
నీరు ప్రగతికి రెండేళ్లకు కలిపి రూ. 3951 కోట్లు ఖర్చు చేశామని, రెండు సంవత్సరాల్లో మంచి ఫలితాలు వచ్చాయని చంద్రబాబు తెలిపారు. 952 టీఎంసీ నీరు వర్షాల ద్వారా వచ్చిందన్నారు. ప్రాజెక్టులన్నింటినీ త్వరలోనే పూర్తీ చేస్తామని స్పష్టం చేశారు.
In drought-hit Rayalseema, our rain-water harvesting efforts have increased the ground water level by 5.71 metres. (2/4)
— N Chandrababu Naidu (@ncbn) July 2, 2016
అదనంగా నీటిని వాడితే చర్యలు తీసుకునేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీని కోసం చెరువుల్లో సెన్సార్లు పెడతామన్నారు. అవసరమైతే వాటర్ ఆడిటింగ్ కూడా చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విద్యుత్ సబ్సిడీకి రూ.5500 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు చెప్పుకొచ్చారు.
Our Govt's efforts in desilting, dredging & water conservation through Neeru-Pragati, Panta Sanjeevani are showing positive results. (1/4)
— N Chandrababu Naidu (@ncbn) July 2, 2016
పంపుసెట్లు వినియోగం తగ్గితే పవర్ ఆదా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో సరికొత్త జలవిధానాన్ని తీసుకొస్తామని అన్నారు. రెండేళ్లలో33 క్యూబిక్ మీటర్ల పని జరుగుతుందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు తగ్గిపోతున్న ప్రాంతంలో బోర్లపై నిషేధం విధించామని అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ముందస్తు జాగ్రత్తలతో భూగర్భ జలాలు పెరిగాయన్నారు.












Click it and Unblock the Notifications