Unstoppable : మళ్లీ బాలయ్య అన్ స్టాపబుల్ లో చంద్రబాబు..! ఈసారి ఏం చెప్పబోతున్నారు ?
తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన ఆహా ఓటీటీ షో అన్ స్టాపబుల్ కు హీరో బాలకృష్ణ వరుసగా మూడు సీజన్లు హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు నాలుగో సీజన్ కు తాజాగా అంకురార్పణ చేశారు. ఇందులో తొలి ఎపిసోడ్ మరోసారి బావ, ఏపీ సీఎం చంద్రబాబుతో షో చేసేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. ఇవాళ హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ ఎపిసోడ్ షూటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు.
గతంలో విపక్ష నేతగా ఉండగా చంద్రబాబు అన్ స్టాపబుల్ షో రెండో సీజన్ లో ఓసారి గెస్ట్ గా దర్శనమిచ్చారు. అందులో లోకేష్ కూడా పాల్గొన్నారు. అప్పట్లో చంద్రబాబును బాలయ్య అడిగిన ప్రశ్నలు, పవన్ కళ్యాణ్ తో పొత్తు వంటి అంశాలు ఆసక్తికరంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వాధినేతగా ఉన్న చంద్రబాబు ఇలా టాక్ షోలో పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ లో తొలి ఎపిసోడ్ ను చంద్రబాబుపై ఇవాళ చిత్రీకరించారు.

ఈసారి అన్ స్టాపబుల్ నాలుగో సీజన్ తొలి ఎపిసోడ్ లో చంద్రబాబు గత సార్వత్రిక ఎన్నికలకు ముందు, తర్వాత చోటు చేసుకున్న పలు అంశాలను బాలయ్యతో పంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకుని ఏపీలో చంద్రబాబు పార్టీ టీడీపీ ఘన విజయం సాధించడం, కేంద్రంలో మోడీ సర్కార్ తో సఖ్యత కొనసాగిస్తుండటం వంటి అంశాలతో పాటు పలు టాస్క్ లలోనూ చంద్రబాబు పాల్గొనబోతున్నారు. త్వరలో ఈ షో ఆహా ఓటీటీలో ప్రదర్శించనున్నారు.












Click it and Unblock the Notifications